అల్లు హీరోకు బుద్ది లేదా ఏంటీ?  

Allu Sirish Next Movie With Rakesh Shashi - Telugu Allu Arjun Younger Brother Allu Sirish, Allu Sirish, Allu Sirish Abcd Movie, Kalyan Dev Chiranjeevi Son In Law, Rakesh Shashi Flop Director

అల్లు శిరీష్‌ హీరోగా పరిచయం అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది.అయినా ఇప్పటి వరకు కనీసం ఒక్కటి అంటే ఒక్కడి కూడా మంచి సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు.

Allu Sirish Next Movie With Rakesh Shashi

అల్లు అరవింద్‌ మరియు అల్లు అర్జున్‌ చాలా ప్రయత్నాలు చేసినా శిరీష్‌ మాత్రం సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కడం లేదు.ఈ ఏడాది ఏబీసీడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్‌ మరోసారి నిరాశ మిగిల్చాడు.

దాంతో ఈయన చాలా గ్యాప్‌ తీసుకుని కొత్త సినిమాకు చేసేందుకు సిద్దం అయ్యాడు.

దాదాపు సంవత్సరం పాటు వెయిట్‌ చేసిన అల్లు శిరీష్‌ తన తదుపరి చిత్రంను రాకేష్‌ శశి దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు.విజేత చిత్రంతో మెగా అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ పరిచయం అయిన విషయం తెల్సిందే.ఆ సినిమాకు రాకేష్‌ శశి దర్శకత్వం వహించాడు.

విజేత ఎలాంటి డిజాస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలాంటి దర్శకుడితో శిరీష్‌ సినిమాను చేసేందుకు ఒప్పుకోవడం చర్చనీయాంశం అవుతుంది.

శిరీష్‌కు కనీసం టేస్ట్‌ లేదా ఫ్లాప్‌ డైరెక్టర్‌తో సినిమా చేయండం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నాడు.అసలు ఇప్పటి వరకు శిరీష్‌ ఒక్క మంచి సినిమా చేయలేదు.అయినా కూడా మళ్లీ ఫ్లాప్‌ డైరెక్టర్‌తోనే చేసేందుకు సిద్దం అవ్వడంతో స్వయంగా మెగా అభిమానులు అసలు శిరీష్‌ మళ్లీ ఆయనతో ఎందుకు చేస్తున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.అల్లు శిరీష్‌ మరో ఫ్లాప్‌ను మూట కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడం ఖాయం.

#Allu Sirish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Sirish Next Movie With Rakesh Shashi Related Telugu News,Photos/Pics,Images..