బాడీ మేకోవర్ తో పిచ్చెక్కిస్తున్న శిరీష్.. వీడియో వైరల్ !

టాలీవుడ్ యంగ్ హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు.అల్లు అర్జున్ తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

 Allu Sirish Latest Workout Video Viral On Social Media-TeluguStop.com

కానీ అల్లు శిరీష్ తన అన్న అల్లు అర్జున్ పేరును ఉపయోగించుకుని పైకి రావాలి అనుకోవడం లేదు.తన నటనతో ప్రేక్షకులను మెప్పించి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు.

అల్లు శిరీష్ చేసిన సినిమాలు ఇప్పటి వరకు సూపర్ హిట్ అవ్వలేదు.

 Allu Sirish Latest Workout Video Viral On Social Media-బాడీ మేకోవర్ తో పిచ్చెక్కిస్తున్న శిరీష్.. వీడియో వైరల్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి.

అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.ముందుకన్నా కూడా ఇప్పుడు అల్లు శిరీష్ నటనలో కొంచెం పట్టు సాధించాడనే చెప్పాలి.

అంతేకాదు ఈ మధ్య బాడీ మెకోవర్ తో అభిమానులకు షాక్ ఇచ్చాడనే చెప్పాలి. అల్లు శిరీష్ చాలా రోజులుగా కొత్త సినిమాలు ఏమి ప్రకటించలేదు.

ఎబిసిడి సినిమా తర్వాత మరొక సినిమా అనౌన్స్ చేయని అల్లు శిరీష్ తన కొత్త సినిమా కోసం మేకోవర్ అవుతున్నట్టు తెలుస్తుంది.

అయితే తాజాగా అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసాడు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.తాను వర్క్ ఔట్స్ ఎలా చేస్తున్నాడు అనేది వీడియో ద్వారా అభిమానులకు పంచుతున్నారు.

ట్రైనింగ్ డే పేరుతొ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసాడు.

ఆయన వర్కౌట్స్ చేస్తూ ఎంత కాస్త పడ్డాడో అనే విషయాన్నీ ఆ వీడియోలో చూపించాడు.ఈ వీడియోకు అభిమానులు నుండి మంచి రెస్పాన్స్ అందుతుంది.అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు.

మొత్తానికి అల్లు శిరీష్ ఫిట్నెస్ గా ఉంటూ అభిమానుల కు ఆ వీడియోలను పంచుతూ వాళ్ళను కూడా మోటివేట్ చేస్తున్నాడు.

#Allu Sirish #Social Media #AlluSirish #AlluSirish #AlluSirish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు