మెగా హీరోకూ సామాన్యుడి కష్టం తప్పలేదు!       2018-06-22   00:20:48  IST  Raghu V

ఎంతటి సెలబ్రెటీ అయినా కూడా కొన్ని సార్లు సామాన్యుడి మాదిరిగానే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని విషయాలు సామాన్యుడికి, సెలబ్రెటీలకు సమానంగా ఉంటాయి. ఆకలి వేయడం, వాతావరణం ఇలా కొన్ని విషయాల్లో హీరోలు అయినా, మెగా హీరోలు అయినా సామాన్యులకైనా ఒకే విధంగా ఫీలింగ్స్‌ ఉంటాయి. ఆ ఫీలింగ్స్‌ను ఎంత డబ్బుతో అయినా కొనలేక పోవచ్చు. తాజాగా మెగా హీరో అల్లు శిరీష్‌కు చాలా చిరాకు కలిగింది. ఈయన వాడుతున్న ఫోన్‌ ఆ చిరాకుకు కారణం అయ్యింది. సోషల్‌ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ప్రస్తుత కాలంలో చేతిలో ఫోన్‌ లేకుంటే ఏ పని చేయలేం. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అంతా కూడా ఫోన్‌ చేతుల లేకుంటే ఏదో మిస్‌ అయినట్లుగా బాధ పడి పోతూ ఉంటారు. అలాంటిది చేతిలో ఉన్న ఫోన్‌లో సిగ్నల్‌ లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఎక్కువగా పల్లెటూరు జనాలు మొబైల్‌లో సిగ్నల్‌ సమస్యలను ఎదుర్కొంటారు. పట్టణాల్లో మొబైల్‌ సిగ్నల్‌ సమస్యలు చాలా తక్కువ. అయితే మెగా హీరో అల్లు శిరీష్‌ మాత్రం మొబైల్‌ నెట్వర్క్‌ సమస్యతో చిరాకు పడుతున్నాడు. ఏం చేయాలో పాలు పోక తాజాగా ట్విట్టర్‌ ద్వారా తన అసహనంను వ్యక్తం చేయడంతో పాటు, అన్ని విధాలుగా మొబైల్‌ నెట్వర్స్‌లను విమర్శించాడు.

ట్విట్టర్‌లో ఈ మెగా హీరో స్పందిస్తూ.. కొన్నాళ్ల క్రితం వరకు తన మొబైల్‌ నెట్వర్క్‌ ఎయిర్‌టెల్‌ అని, తాను ఎయిర్‌టెల్‌ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, సిగ్నల్‌ సరిగా ఉండక పోవడంతో పాటు 4జీ కాదుకదా కనీసం 2జీ కూడా ఉండేది కాదు. అందుకే తాను ఎయిర్‌టెల్‌ నుండి వోడాఫోన్‌కు మారాను. అయినా కూడా నా కష్టాలు పెరిగాయి తప్ప తగ్గలేదు అంటూ వాపోయాడు. వోడాఫోన్‌లో కూడా కాల్‌ డ్రాపింగ్‌, మొబైల్‌ నెట్వర్క్‌ సమస్యలు ఉన్నాయని, ఇక 4జీ చాలా అరుదుగానే వస్తుందని, 2జీ కూడా కొన్ని సార్లు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి సేవలు ఎందుకు చేయడం అంటూ శిరీష్‌ విరుచుకు పడ్డాడు.

మొబైల్‌ నెట్వర్క్‌ పోవడం లేదా, కాల్‌ డ్రాప్‌ అవ్వడం అనేది చాలా కామన్‌. అయితే ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు లేదా ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, కెరీర్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు కాల్‌ డ్రాప్‌ అవ్వడం లేదా నెట్వర్క్‌ లేకపోవడం జరిగితే మాత్రం తీవ్రమైన కోపం వస్తుంది. అప్పుడే మొబైల్‌ నెట్వర్క్‌ మార్చాలనే ఆలోచన కుగుతుంది. అల్లు శిరీష్‌ ఎంత ముఖ్యమైన పనిలో ఉంటే ఇలా కాల్‌ డ్రాప్‌ అయ్యింది. అందుకే ఆయన ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.