అల్లు శిరీష్ తో బింబిసార డైరక్టర్..!

కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ వశిష్ట.కొత్త దర్శకుడే అయినా అతని టేకింగ్ కి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

 Allu Sirish Bimbisara Director Combination Fix , Allu Sirish, Balakrishna, Bimbisara, Geetha Arts, Kalyan Ram, Kalyan Ram Bimbisara, Tollywood, Vashista-TeluguStop.com

ఇక బింబిసార హిట్ తో సత్తా చాటిన డైరక్టర్ వశిష్ట తన నెక్స్ట్ సినిమా మెగా హీరోతో చేస్తున్నాడని తెలుస్తుంది.కొత్త దర్శకుడే అయినా ఒక సినిమా హిట్ కొడితే ఇండస్ట్రీలో వరుస ఛాన్సులు వస్తాయి.

బింబిసార హిట్ తో వశిష్ట పేరు ఇండస్ట్రీలో మారుమోగుతుంది.ఈ క్రమంలో అతనికి ఛాన్సులు క్యూ కడుతున్నాయి.

 Allu Sirish Bimbisara Director Combination Fix , Allu Sirish, Balakrishna, Bimbisara, Geetha Arts, Kalyan Ram, Kalyan Ram Bimbisara, Tollywood, Vashista-అల్లు శిరీష్ తో బింబిసార డైరక్టర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆల్రెడీ బింబిసార చూసి నందమూరి బాలకృష్ణ అతనితో సినిమాకు సిగ్నల్ ఇచ్చేశాడు.మంచి కథతో వస్తే బాలయ్య సినిమా ఓకే అయినట్టే.

వశిష్ట నెక్స్ట్ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ హీరోగా వస్తుందని తెలుస్తుంది.బింబిసార కథను గీతా ఆర్ట్స్ లో కూడా చెప్పాడు వశిష్ట అయితే అతను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడో లేదో అన్న డౌట్ తో అతనితో సినిమా చేయలేదు కానీ సినిమా రిజల్ట్ చూశాక డైరక్టర్ మీద నమ్మకం కలిగింది.

అందుకే గీతా ఆర్ట్స్ వెంటనే పిలిచి అవకాశం ఇచ్చిందట.అల్లు శిరీష్ తో వశిష్ట సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమా తర్వాత బింబిసార 2 కూడా తీస్తారని డిస్కషన్ నడుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube