అల్లు శిరిష్‌కు ఒకేసారి ‘మూడు’ వచ్చిందట

అల్లు శిరీష్‌ కొత్త సినిమా లేక దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది.ఎన్నో కథలు వింటున్న అల్లు శిరీష్‌ ఇప్పటి వరకు దేనికి ఓకే చెప్పలేదు.

 Allu Sirish Act In Threee Movies One Time-TeluguStop.com

అసలు అల్లు శిరీష్‌ కొత్త సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న ఈ సమయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను శిరీష్‌ మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ ఏడాది కనీసం రెండు సినిమాలను అయినా విడుదల చేయనున్నాడట.

Telugu Allu Sirish, Allusirish-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు శిరీష్‌ ఒక మలయాళ సినిమాను రీమేక్‌ చేయబోతున్నాడు.ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది.కొత్త దర్శకుడు ఆ సినిమాతో పరిచయం కాబోతున్నాడు.ఇక అల్లు శిరీష్‌ స్వయంగా ఒక సినిమాను నిర్మిస్తూ అందులో నటించబోతున్నాడు.ఆ సినిమాకు ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక మూడవ సినిమా కోసం అల్లు అరవింద్‌ ఒక కథను ఫైనల్‌ చేశాడట.

త్వరలోనే ఆ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.మూడు సినిమాలను కూడా సమాంతరంగా ప్రారంభించి షూటింగ్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఒకేసారి మూడు సినిమాలు చేయడం అంటే ఈమద్య కాలంలో ఎవరికి సాధ్యం కావడం లేదు.మరి అల్లు శిరీష్‌ ఇన్నాళ్లు గ్యాప్‌ తీసుకున్న కారణంగా ఒకేసారి మూడు సినిమాలు చేయాలని పట్టుదలతో చేస్తాడేమో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube