సినిమా పరిశ్రమలో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.ఈ రెండు కుటుంబాలు ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయాయి.
వాస్తవానికి ఈ రెండు ఫ్యామిలీలకు సంబంధించిన బిజినెస్ లకు కీ రోల్ మాత్రం అల్లు అరవింద్ దే అని చెప్పుకోవచ్చు.మెగా కాంపౌండ్ లో ఏది జరిగినా.
అందులో అల్లు అర్జున్ మార్క్ ఉండాల్సిందే.అయితే అల్లు ఫ్యామిలీ గీతా ఆర్ట్స్ మొదలు పెట్టి.
మంచి సినిమాలు నిర్మించారు.అటు మెగా ఫ్యామిలీ నుంచి రాం చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించాడు.
అయితే ప్రస్తుతం ఇరు ఫ్యామిలీల మధ్య పోటీ నడుస్తుంది అనే వార్తలు వినపడుతున్నాయి.
అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ స్నేహితుడు వాసుతో కలిసి మినిమం బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.
అటు రాం చరణ్ మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద భారీ సినిమాలు మాత్రమే నిర్మిస్తున్నాడు.ఇక అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులున్నారు.బన్నీ హీరోగా ఉంటే పెద్ద కుమారుడు బాబీ నిర్మాతగా మారాడు.ఆయన తొలిసారి వరుణ్ తేజ్ తో గని సినిమాను నిర్మిస్తున్నాడు.
అటు అల్లు శిరీష్ ముంబైలో ఉంటూ బిజినెస్ లు చూసుకుంటున్నాడు.అటు ఆహా ఓటీటీని అల్లు అరవింద్ సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడు.
అటు మెగా ఫ్యామిలీ కొత్త వ్యాపారాలను మొదలు పెడుతుంది.చిరంజీవి కొడుకు రాం చరణ్ తో పాటు కూతురు శ్రీజ కూడా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది.సుష్మిత కొత్త ప్రొడక్షన్ కంపెనీని మొదలు పెట్టి ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లు చేస్తుంది.శ్రీజ తన అన్నయ్య రాం చరణ్ కు అండగా ఉంటూ బ్రాండ్ లకు సంబంధించిన విషయాలను చూసుకుంటుంది.
దీంతో మెగా ఫ్యామిలీ వారసులు అల్లు ఫ్యామిలీని అదిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు.అటు సుష్మిత ఇటీవల నిర్మించిన సేనాపతికి మంచి సక్సెస్ వచ్చింది.అటు రాంచరణ్ నిర్మించిన ఆచార్య సినిమా కూడా త్వరలో జనాల ముందుకు రాబోతుంది.