టాలీవుడ్ రాజకీయాలకు దూరంగా అల్లు ఫ్యామిలీ.. ఎవరితో వివాదం లేకుండా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ గురించి అందరికి తెలిసిందే.అల్లు రామలింగయ్య నుండి ఇటీవలే బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్హ వరకు అందరూ సినీ ఇండస్ట్రీకి పరిచయం ఉన్నవాళ్లే.

 Allu Family Away From Tollywood Politics Without Conflict With Anyone Allu Arju-TeluguStop.com

ఇక అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం పలు సినిమాలలో కూడా బిజీగా ఉన్నాడు.ఇక నిర్మాతగా అల్లు అరవింద్ పలు బాధ్యతలు కూడా చేపట్టాడు.

ఇక అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీతో ఉన్నా సంబంధం గురించి అందరికీ తెలిసిందే.ఇప్పటి వరకు అల్లు ఫ్యామిలీ ఏ గొడవలలో కూడా తల దూర్చలేదు.ఇదిలా ఉంటే ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గొడవలను కూడా అస్సలు పట్టించుకోలేదు.దీంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ టాలీవుడ్ రాజకీయాలకు ఎటువంటి వివాదం లేకుండా దూరంగా ఉన్నారు అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవలే తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఎన్నికల్లో పోటీగా ప్రకాష్ రాజ్మంచు విష్ణు ముందుకు రాగా అందులో మంచు విష్ణు గెలుపొందాడు.

మా అసోసియేషన్ ఎన్నికలకు ముందు ఎన్నికల కోసం ఎంత రచ్చ జరిగిందో చూసాం.మొత్తానికి ఎన్నికలు పూర్తయిన కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ వాదనలు వినిపిస్తున్నాయి.

Telugu Akkinani, Allu Arjun, Allu Sirish, Balakrishna, Manchu Vishnu, Pawan Kaly

ఎన్నికల కంటే ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ ఫంక్షన్ లో ఆంధ్ర ప్రదేశ్ మంత్రుల గురించి, మోహన్ బాబు గురించి ఎంతలా విమర్శలు చేశాడో చూసాం.దీంతో ఎన్నికల తర్వాత మంచు మోహన్ బాబు పవన్ పై రివేంజ్ తీర్చుకుంటాడని అందరూ అనుకున్నారు.కానీ తమ మధ్య గొడవ సద్దుమణిగినట్లు తెలిసింది.

Telugu Akkinani, Allu Arjun, Allu Sirish, Balakrishna, Manchu Vishnu, Pawan Kaly

ఇండస్ట్రీలో ఇదే కాకుండా మరికొన్ని గొడవలు కూడా జరుగగా అల్లు ఫ్యామిలీ మాత్రం వీటికి దూరంగా ఉందని తెలుస్తుంది.అల్లు అర్జున్ అయితే తన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాలకు పోకుండా అందరితో సమానంగా ఉంటున్నారు అల్లు ఫ్యామిలీ.

పైగా ఇండస్ట్రీలో గ్రూపు రాజకీయాలు కూడా జరుగుతున్నాయి.

Telugu Akkinani, Allu Arjun, Allu Sirish, Balakrishna, Manchu Vishnu, Pawan Kaly

అయినా కూడా అల్లు ఫ్యామిలీ వాటికి దూరంగా ఉంటున్నారు.ఇటీవలే బాలకృష్ణ తను ఆహా లో ఓ షోకు హోస్ట్ గా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సందర్భంగా ఆ షోకు సంబంధించిన ఈవెంట్ వేడుకలో అల్లు అరవింద్ బాలకృష్ణతో ఉన్న సన్నిహిత్యం గురించి తెలిపాడు.

అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి కూడా మోస్ట్ ఎలిజిబుల్ సినిమా సమయంలో అల్లు అర్జున్ కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Telugu Akkinani, Allu Arjun, Allu Sirish, Balakrishna, Manchu Vishnu, Pawan Kaly

ఇక పవన్ చేసిన వ్యాఖ్యలకు కూడా అల్లు అరవింద్ స్పందించకపోవడంతో మొత్తానికి అల్లు వారి ఫ్యామిలీ గ్రూపు రాజకీయాలకు, టాలీవుడ్ వివాదాలకు దూరంగా ఉంటున్నట్లు అర్థమవుతుంది.దీంతో అల్లు వారి అభిమానులు కూడా అల్లు కుటుంబానికి మద్దతుగానే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube