క్యూట్ క్యూట్ స్టెప్పులతో రచ్చ చేస్తోన్న అల్లు అయాన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దక్షిణాది సినీ ప్రేక్షకులను, అలాగే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమా నేపథ్యంలో దేశం మొత్తం అల్లు అర్జున్ అంటే ఏందో నిరూపించుకుంటున్నారు.

 Allu Arjun, Allu Aayan, Sneha Reddy, Tollywood, Allu Arha, Dance, Allu Sirish-TeluguStop.com

ఈ సంవత్సరం మొదట్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అలా వైకుంఠపురం లో సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులను కొల్లగొడుతూ కలెక్షన్ల సునామీని సృష్టించింది.ఇక అల్లు అర్జున్ సినిమాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తన కుటుంబంతో కూడా అంతే చురుగ్గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు.

ఇకపోతే అల్లు అయాన్, అలాగే అల్లు అర్హా లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.ఇక అల్లు అర్జున్ కూతురు తన తండ్రితో కలిసి చేసిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.

పెళ్లి విషయంలో తండ్రి కూతుర్ల ముచ్చట్లు ఎంతో ముచ్చటగా కనిపించాయి కూడా.ఇకపోతే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా స్కూల్ కు వెళ్లడం అవసరం లేకపోవడంతో ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసులు తో బిజీ అయిపోయారు అన్న చెల్లెలు.

ఇకపోతే ఈ లాక్ డౌన్ సమయంలో పిల్లలు ఇద్దరు వారి బాబాయ్ అల్లు శిరీష్ ఆధ్వర్యంలో డాన్స్ ను ప్రాక్టీస్ చేశారు.వారి బాబాయ్ స్టెప్పులు వేస్తూ ఉంటే అందుకు తగ్గట్టుగా పిల్లలు కూడా వేశారు.

అందుకు సంబంధించి వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ గా మారింది.ఇకపోతే తాజాగా అల్లు శిరీష్ నేర్పించిన డాన్స్ తో బన్నీ కొడుకు అయాన్ టీవీలో వచ్చే పాటకు స్టెప్పులు వేస్తూ ఇంట్లో అల్లరి అల్లరి చేస్తున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.క్యూట్ క్యూట్ స్టెప్పులు వేస్తూ ఫ్యూచర్ లో జూనియర్ అల్లు అర్జున్ గా పేరు తెచ్చుకుంటాడు ఏమో కాబోలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube