వీడియో : పెదనాన్న సినిమాకు అల్లు అయాన్ పడుతున్న కష్టం చూడండి

వరుణ్‌ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్‌ గా రూపొందిన సినిమా గని.ఈ సినిమాకు కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు.

 Allu Ayaan For Varun Tej Movie Ghani Promotions , Allu Ayaan, Flim News, Ghani,-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మొదటి సారి అల్లు బాబీ నిర్మాతగా పరిచయం అవ్వబోతున్నాడు.అల్లు అరవింద్ పెద్ద కొడుకు అయిన అల్లు బాబీ ఇతర వ్యాపారాలతో బిజీగా ఉండటంతో ఇన్నాళ్లు సినిమా నిర్మాణంపై ఆసక్తి చూపించేవాడు కాదు.

కాని మొదటి సారి పూర్తి స్థాయి నిర్మాతగా మారి తండ్రి సమర్పణలో సొంత బ్యానర్‌ లో సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.అందుకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది.

సిద్దు ముద్దతో కలిసి అల్లు బాబీ ఈ సినిమాను నిర్మించాడు.ఈ సినిమా విడుదల నేపథ్యంలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ ప్రయత్నాల్లో భాగంగా అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్ తో ఒక వీడియోను చేయడం జరిగింది.ఆ వీడియో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్‌ అవుతోంది.

పెద్ద ఎత్తున సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.

అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఎప్పుడు కూడా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంటాడు.అలాంటి అల్లు అయాన్‌ తో గని థీమ్‌ మ్యూజిక్ కు గాను వీడియో ను చేయించడం జరిగింది.పెద్ద ఎత్తున ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి ఉన్న అంచనాలు తాజా వీడియోతో మరింతగా పెరిగాయి అంటున్నారు.అల్లు అయాన్ తన పెదనాన్న అయిన బాబీ మొదటి సినిమా ప్రమోషన్ కోసం కాస్త గట్టిగానే ప్రయత్నించాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయాన్ చెమటలు పట్టే విధంగా గని వర్కౌట్ వీడియో చేశాడు అంటున్నారు.సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు కూడా ఈ వీడియోను షేర్‌ చేస్తున్న నేపథ్యంలో గనీ సినిమా గురించిన చర్చ తెగ జరుగుతోంది.

గని సినిమా లో వరుణ్‌ తేజ్ బాక్సర్‌ గా కనిపించబోతున్నాడు.చాలా మంచి మూవీగా ఈ సినిమా నిలుస్తుందని మెగా కాంపౌండ్ టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube