ఈ విషయంలో అల్లు అర్జున్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్‌     2018-07-17   13:13:23  IST  Ramesh Palla

అల్లు అర్జున్‌ తెలుగులో టాప్‌ హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు. అయితే ఈయనను మించిన హీరోలు తెలుగులో చాలా మంది ఉన్నారు. అయితే ఒక విషయంలో మాత్రం అల్లు అర్జున్‌ కేవలం టాలీవుడ్‌ హీరోలను మాత్రమే కాదు, బాలీవుడ్‌ బాద్‌షాలను కూడా క్రాస్‌ చేసేస్తున్నాడు. ఖాన్స్‌ త్రయం షారుఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లకు సైతం అందని రికార్డును అల్లు అర్జున్‌ దక్కించుకున్నాడు. ఎన్నో బాలీవుడ్‌ క్లాసిక్‌ సినిమాలకు దక్కని రికార్డు అల్లు అర్జున్‌ మూవీ ‘సరైనోడు’కు దక్కింది. యూట్యూబ్‌లో ఈ చిత్రం సాధించిన రికార్డుకు బాలీవుడ్‌ మెగాస్టార్స్‌, సూపర్‌ స్టార్స్‌ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెలుగులో తెరకెక్కిన ‘సరైనోడు’ చిత్రాన్ని హిందీలో శాటిలైట్‌ రైట్స్‌ మరియు యూట్యూబ్‌ రైట్స్‌ కోసం డబ్‌ చేయడం జరిగింది. హిందీలో ఛానెల్‌లో ప్రసారం అయిన సమయంలో ఈ చిత్రానికి భారీ టీఆర్పీ రేటింగ్‌ వచ్చింది. ఇప్పటికే పలు సార్లు హిందీలో ప్రసారం అయినా కూడా ప్రతి సారి కూడా మంచి టీఆర్పీ రేటింగ్‌ దక్కుతూ ఉంది. ఇక ఈ చిత్రం యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్‌ చేయడం జరిగింది. టీవీలో ప్రసారం అయిన వెంటనే యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం జరిగింది. అతి తక్కువ సమయంలో పది మిలియన్‌ వ్యూస్‌ను, ఆ వెంటనే 50 మిలియన్‌ వ్యూస్‌ను, కొన్నాళ్లకే 100 మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుంది.

Allu Arjun's Sarrainodu Hindi Version Becomes The Most Watched Film-

Allu Arjun's Sarrainodu Hindi Version Becomes The Most Watched Film

ఇప్పుడు ఏకంగా 200 మిలియన్‌ వ్యూస్‌ను ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ ‘దిల్‌వాల’ దక్కించుకుంది. ఈ స్థాయి వ్యూస్‌ను ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా కూడా దక్కించుకోలేక పోయింది. ఒక ఫుల్‌ లెంగ్త్‌ మూవీ ఇండియాలో ఇప్పటి వరకు 200 మిలియన్‌ వ్యూస్‌ను రాబట్టలేదు. కాని ఒక సౌత్‌ మూవీ, అది కూడా ఒక డబ్బింగ్‌ మూవీ ఏకంగా రెండు వందల మిలియన్‌ వ్యూస్‌ను రాబట్టడం ఆశ్చర్యంగా ఉంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలు కూడా ఈ చిత్రం వ్యూస్‌లో సగాన్ని కూడా రాబట్టలేక పోతున్నాయి. ఎలా ఇంతగా బన్నీ మూవీకి వ్యూస్‌ వస్తున్నాయి అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌లోని ఫుల్‌ మాస్‌ యాంగిల్‌ను బోయపాటి ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఈ చిత్రంతో వచ్చిన గుర్తింపు కారణంగా అల్లు అర్జున్‌ నటించిన ‘డీజే’ మరియు ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘జులాయి’ చిత్రాలు కూడా భారీ వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయి. డీజే ఏకంగా 175 మిలియన్‌ వ్యూస్‌తో త్వరలోనే 200 మిలియన్‌ వ్యూస్‌కు దగ్గరల్లో ఉంది. ఈ స్థాయిలో హిందీ డబ్బింగ్‌ చిత్రాల వల్ల వ్యూస్‌ను రాబడుతున్నాడు కనుక అల్లు అర్జున్‌ను యూట్యూబ్‌ మెస్టార్‌ అని, యూట్యూబ్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ అంటూ మెగా ఫ్యాన్స్‌ పిలుచుకుంటున్నారు.