మొన్న జాన్వి.. నిన్న రకుల్.. నేడు బన్నీ..! సోషల్ మీడియాలో ఈ ముగ్గురు ఇప్పుడు ట్రెండ్ అవ్వడానికి కారణం అదే.!

‘అదిరేటి డ్రస్సు మేమేస్తే దడ.అది మీకు దడ’.

 Allu Arjuns Impresses With Givenchy T Shirt1-TeluguStop.com

అంటున్నారు యువ నటీనటులు.ఇప్పుడు సెలబ్రెటీలు ఈవెంట్‌లకు హాజరైనప్పుడు వాళ్లు చెప్పే మాటల కంటే వాళ్లు ధరించిన డ్రస్సులే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ ధరించిన దుస్తులు గురించే టాక్.‘టాక్సీవాలా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.

ఆ సినిమాకు సంబంధించి బన్నీ చెప్పిన విషయాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయో లేదో తెలీదు కానీ ఆయన వేసుకొచ్చిన టీషర్ట్, షూస్ మాత్రం హాట్ టాపిక్ అయ్యాయి.కొనుక్కోవాలని పొరపాటున ధర ఎంతో చూస్తే షాక్ అవ్వాల్సిందే.

ఈ ఈవెంట్‌లో బన్నీ ధరించిన ‘GIVENCHY’ అనే ఫేమస్ బ్రాండ్ టీషర్టు, ‘SPEED TRAINERS’ అనే షూ యూత్‌ని బాగా ఆకట్టుకుంది.టీషర్ట్ ధర దాదాపు రూ.65 వేలు, అలాగే షూ ధర 725 డాలర్లు (దాదాపు రూ.50 వేలు) ఈ రెండింటి ధర రూ.లక్షా పదిహేడు వేలు.

గతంలో ఓ పార్టీలో శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ ధరించిన డ్రెస్ ఖరీదు రూ.లక్షా పదిహేడు వేలు.ఇటీవల రకుల్ కూడా ఖరీదైన డెనిమ్ షర్ట్‌లో దర్శనం ఇచ్చింది.

ఆ షర్ట్ పై భాగంలో ఆమె అందాలు కనిపించేట్టుగా డిజైన్ ఉండటంతో అందిరి కళ్లు ఆమె మీద పడ్డాయి.దీంతో అమె ధరించిన డ్రెస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube