హీరోగా బన్నీ కజిన్.. బతుకు బస్టాండ్ అంటున్న విరాన్!

సాధారణంగా మనం రాజకీయాలలో లేదా వ్యాపారాలలో, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వారి వారసులు రావడం మనం చూస్తూనే ఉంటాం.ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమదైన గుర్తింపును సంపాదించుకున్నారు.

 Allu Arjun Cousin Viran Debut As A Hero In Bathuku Bus Stand Movie ,  Alluarjun,-TeluguStop.com

అయితే కొందరు కుటుంబ నేపథ్యంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ వారి సొంత నైపుణ్యం ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.ఆ విధంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు హీరోలుగా అడుగు పెట్టి తమదైన శైలిలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందారు.

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా మెగా కాంపౌండ్ నుంచి వారి వారసులు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.అదేవిధంగా అల్లు వారి కుటుంబం నుంచి అల్లు రామలింగయ్య మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే తన కొడుకు అల్లు అరవింద్ తక్కువ సినిమాల్లో కనిపించినప్పటికీ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ కూడా వరుణ్ తేజ్ నటిస్తున్న “గని” సినిమా ద్వారా నిర్మాతగా మారాడు.

Telugu Alluarjun, Cousin, Debut, Poster, Tollywood, Viran-Movie

అదేవిధంగా అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్, అల్లు శిరీష్ హీరోలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అల్లు శిరీష్ కేవలం కొన్ని సినిమాలకే పరిమితమైన ప్పటికీ అల్లు అర్జున్ తన నటన ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.తాజాగా ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి మరో హీరో అడుగు పెట్టబోతున్నారు.అతను ఎవరంటే.బన్నీ కజిన్ అయిన విరాన్ ముత్తంశెట్టి.ఐవీఆర్ దర్శకత్వంలో కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్న “బతుకు బస్టాండ్“అనే సినిమా ద్వారా నటుడిగా పరిచయం కాబోతున్నారు.అయితే విరాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న” బతుకు బస్టాండ్”సినిమా జూన్ 11న విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube