అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్.. ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరో ఇతడే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో సరికొత్త రికార్డ్ ను నెలకొల్పాడు.ఇంత వరకు ఎవ్వరు సాధించలేని రికార్డ్ ను అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకున్నాడు.

 Allu Arjun Who Made History In Tollywood, Allu Arjun, Tollywood, Ala Vaikunthapurramuloo, Pushpa-TeluguStop.com

సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ అనేది జనాలపై ఎంతలా ప్రభావం చూపిస్తుందో అందరికి తెలుసు.ఇప్పటి రోజుల్లో సినిమాకు మ్యూజిక్ ఎంత ప్లస్ అవుతుంది అంటే మ్యూజిక్ హిట్ అయితే ఆ సినిమాపై అంచనాలు బాగా పెరుగుతాయి.

అలాగే సినిమా కూడా హిట్ అవుతుంది.మ్యూజిక్ సూపర్ హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే.మరి అలాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ ఆల్బమ్స్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందుకున్నాడు.అల్లు అర్జున్ లాస్ట్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో‘.

 Allu Arjun Who Made History In Tollywood, Allu Arjun, Tollywood, Ala Vaikunthapurramuloo, Pushpa-అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్.. ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరో ఇతడే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.

ఈ మ్యూజిక్ ఆల్బమ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమాలోని ప్రతి పాట కూడా కేవలం ఇండియన్ సినిమా దగ్గరే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది.దీంతో అల్లు అర్జున్ ఫస్ట్ 1 బిలియన్ మ్యూజిక్ ఆల్బమ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తో అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసిందే.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Tollywood-Movie

ఈ సినిమా మ్యూజిక్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.ఈ సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది.

ఈ ఆల్బమ్ కూడా రీసెంట్ గా 1 బిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది.ఇలా బన్నీ ఇద్దరు దర్శకులతో రెండు సినిమాలు ఇలా 1 బిలియన్ మార్క్ అందుకోవడం ఆసక్తికరంగా మారింది.

వరుసగా రెండు సినిమాలు బిలియన్ మార్క్ టచ్ చేయడం ఇప్పటి వరకు అల్లు అర్జున్ కె సాధ్యం అనే చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube