స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు లో కంటే కూడా ఇతర భాషల్లోనే ఎక్కువ రీచ్ అయ్యింది.
ఇందులో పుష్ప క్యారక్టర్ ని జనాలు ఎంతలా నచ్చారో, పుష్ప అసిస్టెంట్ గా చేసిన కేశవ పాత్రని కూడా అంతే నచ్చారు ఆడియన్స్.ముఖ్యంగా కేశవ పాత్ర స్లాంగ్ హ్యూమర్ తో కూడిన విధంగా ఉంటుంది.
ఈ పాత్ర ‘పుష్ప : ది రూల్’ లో కూడా కొనసాగుతుంది.ఈ పాత్ర పోషించిన నటుడు పేరు జగదీశ్ ప్రతాప్ బండారి( Jagdish Pratap Bhandari ).ఈయన రీసెంట్ గా ఆహా మీడియా తెరకెక్కించిన ‘సత్తి గాడి రెండెకరాలు’ అనే చిత్రం లో హీరో గా నటించాడు.కొద్దీ రోజుల క్రితమే ఆహా లో స్ట్రీమింగ్ మొదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కేవలం 24 గంటల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం చిన్న సినిమాల్లో అత్యధిక వ్యూస్ ని సాధించిన లేటెస్ట్ చిత్రం గా నిలిచింది.అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఆహా మీడియా లో ప్రసారమయ్యే ‘ఇండియన్ ఐడల్ 2 ‘( Indian Idol 2 ) గ్రాండ్ ఫినాలే లో పాల్గొన్నాడు.ఈ ఫినాలే ఈవెంట్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.ఈ సందర్భంగా జగదీశ్ మరియు అల్లు అర్జున్ మధ్య కాసేపు సరదాగా చిట్ చాట్ నడిచింది.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఇప్పుడు హీరో గా సక్సెస్ అయ్యావు కదా, ఇక క్యారక్టర్ రోల్స్ చెయ్యను అని ఓవర్ యాక్షన్ చేస్తావా’ అని అంటాడు అల్లు అర్జున్.అప్పుడు జగదీశ్ అయ్యో అలాంటిది ఏమి లేదు సార్ అని బదులిస్తాడు.
తొందరగా పుష్ప సెట్స్ కి రా, నీకోసం అందరూ వెయిటింగ్, హీరో అయ్యిపోయాను నా సినిమాలో చెయ్యాను అంటే చంపేస్తా అంటూ అల్లు అర్జున్ కాసేపు సరదాగా కేశవతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఇక ‘పుష్ప : ది రూల్’( Pushpa: The Rule ) సినిమా విషయానికి వస్తే రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా శరవేగంగా షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంటూ ముందుకి దూసుకుపోతుంది.రీసెంట్ గానే విడుదల అయిన గ్లిమ్స్ వీడియో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.గ్లిమ్స్ వీడియో కంటే కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ తెగ వైరల్ అయ్యింది.
చీర కట్టుకొని అమ్మవారి గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ ని చూసి అందరూ నోరెళ్లబెట్టారు.ఈ ఏడాది డిసెంబర్ లోగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్ల రూపాయలకు పలుకుతుందని అంటున్నారు.
