ఇన్నాళ్లకు సొంతూరు పోయిన బన్నీ అక్కడి వారికి బంపర్ ఆఫర్ ప్రకటించాడు

అల్లు అర్జున్ ప్రతి పండుగకు అత్తగారి ఇంటికి పోవటం లేదా కుటుంబ సభ్యలతో గడపడం చేస్తూ ఉంటాడు.కానీ ఈ సంక్రాంతికి మాత్రం అల్లు అర్జున్ తన ఫ్యామిలీ తో కలిసి తన తాత ఊరు, తన తండ్రి పుట్టిన ఊరు పాలకొల్లు వెళ్ళాడు.

 Allu Arjun Wants To Build A Function Hall For People In Palakollu-TeluguStop.com

పాలకొల్లు లో సంక్రాంతి ఉత్సవాలు భారీగా చేశాడు.ప్రస్తుతం సినిమాలు ఏమి లేని కారణంగా బన్నీ ఇలా పండుగకు ఊరు వెళ్ళాడు.

పండుగ సందర్భంగా బన్నీ అక్కడ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

అల్లు రామలింగయ్య విగ్రహం వద్ద అల్లు అర్జున్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.ఆ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.చాలా కాలంగా ఇక్కడకు రావాలని కోరుకున్నాను.

కానీ ఇన్నాళ్లకు అది వీలైంది.ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది.

సినిమా లతో బిజీ ఉండటం వల్ల ప్రతి ఏడాది రావాలని భావించినా కూడా రాలేక పోయాను.పాలకొల్లు లో అల్లు ఫ్యామిలీ తరపున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు.

పాలకొల్లులో ఇప్పటి వరకు ఫంక్షన్ హాల్ ను నిర్మించాలని భావించి నిర్మించలేక పోయాం.ఆ ఫంక్షన్ హాల్ ను ఇప్పుడు పూర్తి చేస్తానంటూ ప్రకటించాడు.అతి త్వరలోనే ఫంక్షన్ హాల్ పనులు ప్రారంభిస్తామని బన్నీ చెప్పుకొచ్చాడు.బన్నీ అందుకోసం నిధులను కేటాయించబోతున్నట్లుగా కూడా చెప్పాడు.ఫంక్షన్ హాల్ ను పాలకొల్లు ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నాడు.ఇక బన్నీ సినిమా మార్చ్ లో ప్రారంభం కాబోతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube