వైరల్.. 'ఎఫ్ 3' సెట్స్ లో బన్నీ.. సందడి మాములుగా చేయలేదుగా!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఎఫ్ 3.ఇది F2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది.F2 సినిమా విడుదల అయ్యి ఊహించని స్థాయిలో ఘన విజయం సాధించింది.కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

 Allu Arjun Visits F3 Movie Sets Pics Viral In Social Media,  F3 Movie, Varun Te-TeluguStop.com

ఇప్పుడు ఎఫ్ 3 సినిమాను కూడా మరింత ఫన్ తో తెరకెక్కించి ప్రేక్షకులను మరొకసారి నవ్వించ డానికి రెడీ అవుతుంది చిత్ర యూనిట్.

ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్ కూడా రివీల్ చేసారు.డబ్బు చుట్టూ నడిచే కామెడీ డ్రామాను తెరకెక్కించ బోతున్నట్టు అనిల్ రావిపూడి తెలిపాడు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచింది.ఆ పోస్టర్ లో వరుణ్ తేజ్, వెంకటేష్ డబ్బులతో నిండిన ట్రాలీలను నెట్టు కెళ్తున్నట్టు కనిపించారు.

ఇక ఈ సినిమా ప్రెసెంట్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపు కుంటుంది.

Telugu Allu Arjun, Allu Arjun Sets, Alluarjun, Anil Ravipudi, Drama, Dil Raju, S

ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇక తాజాగా ఎఫ్ 3 సెట్స్ లోకి అనుకోకుండా ఒక ప్రత్యేక గెస్ట్ వచ్చారట.అది మరెవరో కాదు.

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్.బన్నీ అనుకోకుండా ఎఫ్ 3 సెట్స్ దగ్గరకు వెళ్లారు.

దీంతో సెట్స్ లో సందడి వాతావరణం నెలకొంది.

Telugu Allu Arjun, Allu Arjun Sets, Alluarjun, Anil Ravipudi, Drama, Dil Raju, S

బన్నీ సందడి చేసిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.బన్నీ వరుణ్ తేజ్, వెంకటేష్, సునీల్, రాజేంద్రప్రసాద్, అనిల్ రావిపూడి తో మాట్లాడుతున్న ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేసారు.ఇక ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇది ఇలా ఉంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube