వెంకీ రికార్డుకు పుష్ప ఎసరు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి కానుకగా నటించిన అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

 Allu Arjun Targets Venkatesh Blockbuster Movie Allu Arjun, Venkatesh, Aa20, Lak-TeluguStop.com

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న బన్నీ, తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టుకున్న ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి.

తొలుత ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ అనుకున్నా, ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు పుష్ప అనే లేడీ ఓరియెంటెడ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.ఈ టైటిల్‌తో విక్టరీ వెంకటేష్ బ్లాక్‌బస్టర్ మూవీకి బన్నీ ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది.

గతంలో వెంకటేష్ నటించిన లక్ష్మీ చిత్రం ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమాను బన్నీ టార్గె్ట్ చేశాడు.

లేడీ ఓరియెంటెడ్ టైటిల్స్‌లో వెంకటేష్‌కు ఉన్న క్రేజ్ వేరు.లక్ష్మీ, తులసి వంటి చిత్రాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు బన్నీ నటిస్తున్న చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను పెట్టేందుకు చిత్ర యూనిట ఫిక్స్ అయ్యారు.ఈ సినిమాలో బన్నీ పాత్ర పేరు పుష్పక్ నారాయణ్ అని తెలుస్తోంది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube