బన్నీ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’  

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు టైటిల్‌గా పలు పేర్లు ప్రస్తావణకు వస్తున్నాయి. ముందు ఈ సినిమాకు ‘తిశూలం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ‘హుషారు’ అనే టైటిల్‌ బన్నీ స్టైల్‌కు తగ్గట్లుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘జాదుగర్‌’ అనే టైటిల్‌ కూడా అన్నారు. అయితే తాజా ఈ సినిమాకు అవేవి కావని మరో కొత్త టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది.

ఈ మెగా మూవీకి ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. కథానుసారం ఈ తండ్రి కొడుకుల మధ్య ఈ సినిమా ఉంటుంది కనుక ఈ టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది. సమంత, నిత్యామీనన్‌, అదా శర్మలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. ‘జులాయి’ తర్వాత రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.