ఆరు ఫైట్లు..మూడు ఈవెంట్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్న బన్నీ!

Allu Arjun Turns Chief Guest For Varudu Kavalenu Pre Release Event

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకు పోతుందనే చెప్పాలి.అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు బయట కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ సమయానికి తగ్గట్టుగా పంచ్ లు వేస్తూ అందరిని తన మాటలతో ఆకట్టుకుంటూ ఉంటాడు.

 Allu Arjun Turns Chief Guest For Varudu Kavalenu Pre Release Event-TeluguStop.com

ఇక ఈ మధ్య అల్లు అర్జున్ ఈవెంట్స్ లో బాగా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.ఒకవైపు పుష్ప సినిమాను ఫారెస్టులో పూర్తి చేస్తూనే మరొక వైపు ఈవెంట్స్ తో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు.

ఇటీవలే అఖిల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు బన్నీ.ఆ ఈవెంట్ లో బన్నీ మాట్లాడిన మాటలు ఇప్పటికే వినిపిస్తూనే ఉన్నాయి.ఇక ఇప్పుడు నాగ శౌర్య నటిస్తున్న వరుడు కావలెను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రెడీ అవుతున్నాడు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శిల్పకళారామం లో జరగనుంది.

 Allu Arjun Turns Chief Guest For Varudu Kavalenu Pre Release Event-ఆరు ఫైట్లు..మూడు ఈవెంట్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్న బన్నీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ వేడుకలో చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ మరొక సారి సందడి చేయబోతున్నాడు.

అల్లు అర్జున్ ఇప్పటికే ఆల్ ఓవర్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో.అందుకే ఈయన గెస్ట్ గా వస్తే సినిమాకు మంచి ప్రమోషన్స్ వస్తాయని చిన్న సినిమాల దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.అందుకే ఆయనను ఒప్పించి చీఫ్ గెస్టులుగా తీసుకు వస్తున్నారు.

అంతేకాదు వరుడు కావలెను మేకర్స్ కు బన్నీకి మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నాడట.

ఇక అల్లు అర్జున్ ఏ ఈవెంట్ కు వెళ్లిన పుష్ప.పుష్ప అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు.ఆయన ఈవెంట్స్ లో పాల్గొనడం వల్ల ఆయన సినిమాకు కూడా మంచి ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

అందుకే ఆ సినిమాతో పాటు తన సినిమాకు కూడా కలిసి వస్తుందని బన్నీ ఈ మధ్య తరచు కనిపించి సందడి చేస్తున్నాడు.ఇక బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా కూడా డిసెంబర్ 17న థియేటర్స్ లో రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.

#AlluArjun #Allu Arjun #Varudu Kavalenu #Pushpa #Guest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube