పుష్ప మేకోవర్ నుంచి బయటకొచ్చిన బన్నీ  

Allu Arjun Transform to Natural from Pushpa Mecover, Tollywood, Sukumar, bunny, Pushpa Movie - Telugu Allu Arjun Transform To Natural From Pushpa Mecover, Bunny, Pushpa Movie, Sukumar, Tollywood

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న మూవీ పుష్ప.ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే ఫస్ట్ లుక్ తో సందడి చేసింది.

TeluguStop.com - Allu Arjun Transform To Natural From Pushpa

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

మరో సారి సుకుమార్ రంగస్థలం స్టైల్ లో ఫుల్ లెంత్ మాస్ కమర్షియల్ స్టొరీని ఆవిష్కరించడానికి రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అనగా లాక్ డౌన్, కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడిపోయింది.

TeluguStop.com - పుష్ప మేకోవర్ నుంచి బయటకొచ్చిన బన్నీ-Movie-Telugu Tollywood Photo Image

ఇక పుష్ప సినిమా కోసం బన్నీ గుబురుగా మాసిన గెడ్డంతో పవర్ ఫుల్ మాస్ లుక్ లోకి మేకోవర్ అయ్యాడు.ఆ లుక్ తోనే ఇన్ని రోజులు ఉన్నాడు.

అయితే కరోనా పరిస్థితులు రోజు రోజుకి శృతి మించుతున్నాయి తప్ప తగ్గుముఖం పట్టడం లేదు.ప్రభుత్వం షూటింగ్ లకి అనుమతి ఇచ్చిన కూడా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపధ్యంలో రిస్క్ తీసుకోవడానికి నిర్మాతలు ధైర్యం చేయడం లేదు.

***

అలాగే నటులు కూడా షూటింగ్ లలో పాల్గొనడానికి ఆసక్తి చూపించడం లేదు.

ఇదిలా ఉంటే ఇన్ని రోజులు అల్లు అర్జున్ పూర్తిగా పుష్ప మేకోవర్ లో కనిపిస్తూ ఉండేవాడు.

ఏదో ఒక టైంలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని అదే లుక్ ని మెయింటేన్ చేస్తూ వచ్చాడు.అయితే తాజాగా మాసిన గెడ్డం మొత్తం తీసేసి క్యాజువల్ లుక్ లోని మారిపోయాడు.

బన్నీ లుక్ చూస్తూ ఉంటే ఇక కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గెంత వరకు పుష్ప సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు లేవని అనిపిస్తుంది.కరోనాకి వ్యాక్సిన్ వచ్చిన తర్వాతనే సినిమా షూటింగ్ లకి వెళ్లాలని స్టార్ హీరోలు అందరూ మూకుమ్మడిగా ఫిక్స్ అయినట్లు ప్రస్తుతం టాలీవుడ్ కండిషన్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది.

#AlluArjun #Sukumar #Bunny

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Transform To Natural From Pushpa Related Telugu News,Photos/Pics,Images..