పుష్ప కోసం బన్నీ కష్టం.. కేవలం ఒక్క షాట్ కోసం 12 గంటలు శ్రమించాడట..

పుష్పరాజ్ తన మ్యానియాను దేశం మొత్తం చూపిస్తున్నాడు.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల అయినా విషయం తెలిసిందే.

 Allu Arjun Took 12 Hours To Shoot A Single Shot In Pushpa Details, Allu Arjun, A-TeluguStop.com

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు.ఈ సినిమా విడుదల అయ్యి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను సాధించింది.

దీంతో నార్త్ నుండి సౌత్ వరకు పుష్పరాజ్ ఒక అలజడిని సృష్టించాడనే చెప్పాలి.తనదైన నటనతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా మొత్తం తన నటనతో తనవైపుకు తిప్పుకున్నాడు.

ఆయన నటనకు సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.ఎప్పుడు తన సినిమాల్లో స్టైలిష్ లుక్ లో కనిపించే బన్నీ ఈసారి పుష్ప సినిమా కోసం పూర్తిగా చేంజ్ అయ్యాడు.

పుష్ప సినిమాలో లోపాలు ఉన్నప్పటికీ తన నటనతో ఆ లోపాలను సైతం అధిగమించాడు బన్నీ.ఇందుకోసం అల్లు అర్జున్ మాములుగా శ్రమ పడలేదు.

Telugu Hours, Allu Arjun, Alluarjun, Eyy Bidda, Pushpa, Sukumar-Movie

ఈ సినిమాలో ప్రతి సీన్ కోసం తెరవెనుక చాలా కష్ట పడ్డాడు.ఇంత కృషి చేయబట్టే బన్నీ ని పైన నిలబెట్టింది పుష్ప సినిమా.ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఎంత కృషి చేసాడో మేకర్స్ తెలుపుతూ ఒక ఆసక్తికర విషయాన్నీ పంచుకుంది.

Telugu Hours, Allu Arjun, Alluarjun, Eyy Bidda, Pushpa, Sukumar-Movie

పుష్ప లోని ఏయ్ బిడ్డా పాటలోని ఒక్క షాట్ కోసం అల్లు అర్జున్ ఎలాగా 12 గంటలు శ్రమించారంటా.ఈ పాట షూట్ గురించి మేకర్స్ చెబుతూ ఈ సాంగ్ షూట్ మధ్యాహ్నం 2 గంటలకు మొదలయితే తెల్లవారు జామున 2 గంటల వరకు పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ పాట కోసం అల్లు అర్జున్ 24 డ్రెస్ లు ధరించారట.

కేవలం ఈ పాట కోసం అల్లు అర్జున్ ఇంత కృషి చేసాడని చెప్పడంతో బన్నీ అభిమానులు తమ హీరో పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube