అల్లు అర్జున్‌ 20వ చిత్రం టైటిల్‌ ఇదేనంటా..!

అల్లు అర్జున్‌ 20వ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.కరోనా విజృంభించకుంటే సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కేరళలో జరిగేది.

 Sukumar Announce The Allu Arjun 20th Movie Tittle On His Birthday, Allu Arjun, T-TeluguStop.com

కాని షూటింగ్స్‌ అన్నీ కూడా క్యాన్సిల్‌ అయ్యాయి.దాంతో బన్నీ 20 చిత్రంను కూడా షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయడం జరిగింది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈనె 8న బన్నీ బర్త్‌డేకు ఫస్ట్‌లుక్‌ వచ్చేది.కాని షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాని నేపథ్యంలో ఫస్ట్‌లుక్‌ విడుదల అసాధ్యం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Allu Arjun, Arya, Tollywood-Movie

సుకుమార్‌ ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్‌కు బర్త్‌డే సెబ్రేషన్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ కోసం సినిమా టైటిల్‌ను ఖరారు చేసి బర్త్‌డే సందర్బంగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడట.వీరిద్దరి కాంబోలో గతంలో ఆర్య ఇంకా ఆర్య2 చిత్రాలు వచ్చాయి.ఆ రెండు సినిమాలు కూడా రెండు అక్షరాల టైటిల్స్‌తోనే వచ్చింది.కనుక ఇప్పుడు వీరి కాంబోలో మూడవ సినిమా కూడా అదే టైటిల్‌తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

రెండు అక్షరాల టైటిల్‌ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారట.

వేట అనే టైటిల్‌ను ఈ సినిమా కోసం రిజిస్ట్రర్‌ చేయించారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అయితే ఆ విషయంలో నిజం ఎంత అనే విషయంపై క్లారిటీ లేదు.

వేట అనే టైటిల్‌ ఈ స్క్రిప్ట్‌కు బాగా సూట్‌ అవుతుందని, లారీ డ్రైవర్‌గా బన్నీ కనిపించబోతున్నాడు కనుక వేట అనేది ప్రస్తుతం సినిమాకు సరిగ్గా సూట్‌ అయ్యే టైటిల్‌గా చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube