బన్నీ కల నెరవేరబోతుంది.. చరణ్‌ పరిస్థితి ఏంటీ?     2018-08-09   10:14:59  IST  Ramesh Palla

మెగా హీరోల సినిమాల చిత్రాల్లో నటించాలని హీరోయిన్స్‌ మరియు చిన్న నటీనటులు కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, చరణ్‌, బన్నీ వంటి హీరో సినిమాల్లో నటిస్తే కెరీర్‌కు ప్లస్‌ అవుతుందని ఎక్కువ శాతం క్యారెక్టర్‌ ఆర్టిస్టులు మరియు కమెడియన్స్‌ భావిస్తూ ఉంటారు. అయితే మెగా హీరోలు కూడా కొన్ని సార్లు చిన్న నటీనటుల మాదిరిగా కోరుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్‌కు చాలా కాలంగా ఒక కోరక ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరబోతుంది. మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో అల్లు అర్జున్‌కు నటించే అవకాశం రావడంతో చాలా కాలపు కోరిక తీరబోతుంది.

Allu Arjun To Play Guest Role In Saira Narasimha Reddy-

Allu Arjun To Play Guest Role In Saira Narasimha Reddy

అల్లు అర్జున్‌కు చాలా కాలంగా చిరంజీవి సినిమాలో నటించాలని ఉంది. హీరో కాకముందు ఒకసారి అల్లు అర్జున్‌ మామయ్య మెగాస్టార్‌ చిత్రంలో నటించాడు. అయితే హీరో అయ్యాక మాత్రం చిరంజీవితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు. తన సినిమాలో చిరంజీవిని గెస్ట్‌ అప్పియరెన్స్‌తో తీసుకు రావాని అల్లు అర్జున్‌ చాలా సార్లు ప్రయత్నించాడు, కాని అది సాధ్యం కాలేదు. ఇన్నాళ్లకు చిరంజీవి మూవీలోనే అు్ల అర్జున్‌ ఒక గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చే అవకాశం దక్కించుకున్నాడు.

Allu Arjun To Play Guest Role In Saira Narasimha Reddy-

చిరంజీవి సైరా మూవీలో ఇప్పటికే మెగా డాటర్‌ నిహారిక నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఒక కీలకమైన పాత్ర కోసం అల్లు అర్జున్‌ను దర్శకుడు సంప్రదించడం చర్చనీయాంశం అవుతుంది. చిరంజీవి మూవీలో పాత్ర ఎలాంటిదైనా కూడా నటించేందుకు తాను సిద్దంగా ఉంటాను అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. త్వరలోనే బన్నీ మరియు చిరంజీవిల కాంబోలో సీన్స్‌ను చిత్రీకరించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో బన్నీ ఉండటం వల్ల ఖచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణగా ఉంటుందని సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

రామ్‌ చరణ్‌ దాదాపు 200 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. అల్లు అర్జున్‌తో పాటు ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ కూడా ఉండాలని మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం.150లో చరణ్‌ ఒక మెరుపు మెరిసిన విషయం తెల్సిందే. అలాగే సైరాలో కూడా చరణ్‌ మెరవాలని ఎక్కువ శాతం ఫ్యాన్స్‌ కోరుతున్నారు. మరి వారి కోరిక తీరేనా లేదా అనేది చూడాలి.