ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ.సెలబ్రిటీలతో పాటు సెలబ్రిటీ పిల్లలకి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీ పిల్లలకి కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు.ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకున్న కొందరు దర్శక నిర్మాతలు వారి పిల్లల చేత పలు సినిమాలలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు గారాలపట్టి సితార ఇంత చిన్న వయసుకే ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటెన్ చేస్తుంది అంటేనే తెలుస్తుంది ఈమెకు అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో తెలిసిపోతుంది.
అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హకి కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజిలో ఉందని చెప్పవచ్చు.
ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ వెండితెర పై అరంగ్రేటం చేయడానికి లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు.గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “శాకుంతలం” సినిమాలో అల్లు అర్హ భరతుడి పాత్రలో నటించనున్నారు.
అల్లు అర్హ తరహాలోనే మరికొంతమంది టాలీవుడ్ స్టార్ కిడ్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇప్పటికే “నేనొక్కడినే” సినిమాలో సందడి చేశారు.ఇక కూతురు సితార ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్నటువంటి “సర్కారీ వారి పాట” చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం.ఇక ఇండస్ట్రీలో నందమూరి వారసులకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్నటువంటి “ఆర్ఆర్ఆర్” చిత్రంలో చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

తెలుగులో మాత్రమే కాకుండా పలు ఇండస్ట్రీలలో కూడా సెలబ్రెటీలు వారి పిల్లలు వెండితెర అరంగ్రేటం చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ కూతురు కూడా తన సినిమాలలో కనిపించబోతోందని తెలుస్తోంది.”కేజిఎఫ్” సినిమా ద్వారా సంచలనం సృష్టించిన హీరో యష్ కూతురు కూడా బాలనటిగా వెండితెరపై సందడి చేయనున్నట్లు సమాచారం.ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పిల్లలు కూడా ఇదివరకు పలు సినిమాలలో బాలనటులుగా సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.