సెంటిమెంట్‌ను వదలని సుకుమార్.. బన్నీ కోసం ఇద్దరు!  

Allu Arjun To Have Two Brothers In Pushpa, Allu Arjun, Pushpa, Sukumar, Rashmika Mandanna, Tollywood News - Telugu Allu Arjun, Pushpa, Rashmika Mandanna, Sukumar, Tollywood News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.

 Allu Arjun To Have Two Brothers In Pushpa

కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఈ సినిమాలోని బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే దర్శకుడు సుకుమార్ ఓ సెంటిమెంట్‌ను ఈ సినిమాలో కూడా ఫాలో అవుతున్నాడట.సుకుమార్ డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం చిత్రం ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే.

సెంటిమెంట్‌ను వదలని సుకుమార్.. బన్నీ కోసం ఇద్దరు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాను కూడా మాస్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తీర్చిదిద్దడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఇక ఈ సినిమాలో చరణ్‌కు ఓ అన్నయ్య ఉంటాడు.

కథలో కీలకంగా అతడి పాత్ర ఉండటంతో ఇప్పుడు పుష్ప చిత్రం కోసం కూడా బన్నీకి అన్నయ్యను పెడుతున్నాడు.అయితే ఈ సినిమాలో బన్నీకి ఒకరు కాదు ఇద్దరు అన్నయ్యలు ఉంటారని తెలుస్తోంది.

కథలో వారి పాత్రలు చాలా కీలకంగా ఉంటాయని, రంగస్థలం సెంటిమెంట్ ఈ సినిమాలో కూడా వర్కవుట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక బన్నీకి అన్నయ్యలుగా నటించేది ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఏదేమైనా తన గత చిత్రంలోని సెంటిమెంట్‌ను పుష్పలో కూడా ఫాలో అవుతుండటంతో సుకుమార్ ఈ సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

#Sukumar #Pushpa #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun To Have Two Brothers In Pushpa Related Telugu News,Photos/Pics,Images..