సుకుమార్ కోసం బన్నీ అలా చేస్తున్నాడా..?  

Allu Arjun To Have Negative Shades For Sukumar - Telugu Aa20, Allu Arjun, Negative Shades, Rashmika Mandanna, Sukumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే సక్సె్స్‌ను అందుకున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాకుండా బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ మూవీగా నిలిచింది.

Allu Arjun To Have Negative Shades For Sukumar - Telugu Aa20 Rashmika Mandanna

ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో జోష్‌ మీద ఉన్న బన్నీ తన నెక్ట్స్ మూవీని కూడా అప్పుడే మొదలెట్టాడు.

క్రియేటివ్ చిత్రాల దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ప్రారంభించిన బన్నీ, ఈ సినిమాలో చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింది.

ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ కథలో బన్నీ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్టు ఉంటుందని, బన్నీ పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌ కలిగి ఉంటుందని తెలుస్తోంది.

క్లైమాక్స్‌లో వచ్చే ఈ ట్విస్టు సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోతుందని, ఈ ఒక్క ట్విస్టుతో సినిమా ఊహించని మలుపు తిరుగుతుందని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడనే విషయం ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది.

తాజా వార్తలు

Allu Arjun To Have Negative Shades For Sukumar-allu Arjun,negative Shades,rashmika Mandanna,sukumar Related Telugu News,Photos/Pics,Images..