మళ్లీ చొక్కా విప్పనున్న బన్నీ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Allu Arjun To Give Solid Treat In Pushpa, Allu Arjun, Pushpa, Sukumar, Six Pack,-TeluguStop.com

ఇక ఈ సినిమాలో బన్నీ లుక్ అల్ట్రా రఫ్ లుక్‌లో కనిపించనున్నట్లు ఇప్పటికే ఆయన లుక్స్ సోషల్ మీడియాలో అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకున్నాయి.కాగా తాజాగా ఈ సినిమాలో బన్నీ ప్రేక్షకులకు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

పుష్ప చిత్రంలో బన్నీ చాలా స్లిమ్ అండ్ టైట్‌గా కనిపిస్తాడట.కాగా ఈ సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశాడని, ఓ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లో మనకు తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తాడని తెలుస్తోంది.

గతంలో దేశముదురు చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బన్నీ, ఇప్పుడు మరోసారి అలాంటి లుక్‌తో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాచ్‌లో లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

బన్నీ సరసన హీరోయిన్‌గా కన్నడ కుట్టి రష్మిక మందన నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తొలుత తమిళ నటుడు విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసినా, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు.మరి ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎవరు నటిస్తారనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube