బన్నీ నుండి మరో ట్రీట్.. అదే అంటోన్న ఫ్యాన్స్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో ఈసారి ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేయాలని బన్నీ ప్లాన్ చస్తున్నాడు.

 Allu Arjun To Give Clarity On Icon This Week, Allu Arjun, Pushpa, Icon, Venu Sri-TeluguStop.com

ఇక ఈ సినిమాను క్రియేటివ్ చిత్రాల దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అంతే భారీస్థాయిలో నటీనటులు ఉండటం మరో విశేషం.

అయితే ఇటీవల పుష్ప చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను ఫుల్ స్వింగ్‌లో మొదలుపెట్టారు చిత్ర యూనిట్.

కాగా బన్నీ ఈ వారంలో మరో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి అల వైకుంఠపురములో చిత్రానికంటే ముందే బన్నీ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ‘ఐకాన్’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు.కానీ ఆ సినిమా ఎందుకో పట్టాలెక్కలేదు.

దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అనే డైలమా అందరిలోనూ నెలకొంది.కానీ వకీల్ సాబ్ చిత్రంతో దర్శకుడు వేణు శ్రీరామ్ తన సత్తా చాటడంతో ఇప్పుడు మరోసారి ‘ఐకాన్’ సినిమా గురించి ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.

అయితే తాజాగా ఐకాన్ చిత్ర స్క్రిప్టుకు సంబంధించి దర్శకుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఫైనల్ స్క్రిప్టును పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మరో రెండు, మూడు రోజుల్లో బన్నీతో ఈ స్క్రిప్టుకు సంబంధించి చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

దీంతో బన్నీకి గనక ఈ ఫైనల్ స్క్రిప్టు నచ్చితే ఈ వారంలో ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని చిత్ర నిపుణులు అంటున్నారు.ఏదేమైనా పుష్ప చిత్ర మేనియాతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న బన్నీ ఫ్యాన్స్‌కు ఐకాన్ అనౌన్స్‌మెంట్ మరింత ఉత్సాహాన్ని ఇవ్వడం ఖాయం.

మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube