బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తోన్న బన్నీ  

Allu Arjun To Give Birthday Surprise - Telugu Aa20, Allu Arjun, First Look, Sukumar, Telugu Movie News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో బన్నీ యాక్టింగ్‌ను ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు.

 Allu Arjun To Give Birthday Surprise

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని మరోసారి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీ చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.

బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తోన్న బన్నీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందని, బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తాడని ఫిలిం నగర్‌ టాక్.ఇక ఈ సినిమా కోసం బన్నీ గడ్డం గుబురుగా పెంచిన లుక్‌‌తో ఇప్పటికే ఆడియెన్స్‌కు కనిపించాడు.

కాగా తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ తెగ హల్‌చల్ చేస్తోంది.

తమలోని క్రియేటివిటీని బయటపెడుతూ ఫ్యాన్స్ రూపొందించిన ఈ పోస్టర్‌లో బన్నీ నిజంగా అదరగొట్టాడు.

ఈ పోస్టర్ బన్నీ కంట పడటంతో తన పుట్టినరోజైన ఏప్రిల్ 18న ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా స్కెచ్ లుక్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట.ఈ మేరకు చిత్ర యూనిట్‌కు ఆ పనులు కూడా అప్పగించాడట.

మరి బన్నీ బర్త్‌డే గిఫ్ట్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun To Give Birthday Surprise Related Telugu News,Photos/Pics,Images..