ఇన్నాళ్లు ఊరించి చివరకు మీరు చేసేది ఇదా?  

Allu Arjun To Do Son Of Satyamurthy Sequel-

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.జులాయి మరియు సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు బన్నీ కెరీర్‌లో కీలకంగా ఉంటాయి.

Allu Arjun To Do Son Of Satyamurthy Sequel-

ఇప్పుడు వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్‌ మూవీకి రంగం సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న వీరి కాంబో మూడవ సినిమా కథ గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

మొదట వీరిద్దరి మూవీ బాలీవుడ్‌ మూవీకి రీమేక్‌ అంటూ ప్రచారం జరిగింది.అయితే ఆ కథకు అల్లు అర్జున్‌ నో చెప్పాడట.

Allu Arjun To Do Son Of Satyamurthy Sequel-

దాంతో వేరే కథను సిద్దం చేయడం జరిగింది.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సన్నాఫ్‌ సత్యమూర్తి కథ తరహాలోనే తండ్రి, కొడుకుల సెంటిమెంట్‌తో ఒక కథను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది.

సన్నాఫ్‌ సత్యమూర్తి కథకు ఇది సీక్వెల్‌గా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.ఆ సినిమా కథకు కాస్త అటు ఇటుగా ఈ చిత్రం కథ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందబోతున్న ఈచిత్రం విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయవద్దనే ఉద్దేశ్యంతో సక్సెస్‌ సెంటిమెంట్‌ ను, కథను ఫాలో అవ్వాలని నిర్ణయించారు.

ఆరు నెలలుగా కథ రెడీ కాలేదు అంటూ వెయిట్‌ చేసిన బన్నీ చివరకు సన్నాఫ్‌ సత్యమూర్తి కథ కొనసాగింపుగా సినిమా చేయడం ఏంటని కొందరు మెగా ఫ్యాన్స్‌ నిటూర్చుతున్నారు.అయితే కొందరు మెగా సన్నిహితులు మాత్రం ఈ చిత్రం పూర్తి కొత్త కథ అని, తప్పకుండా అందరికి నచ్చే విధంగా సినిమా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను ఈనెల చివర్లో ప్రారంభించి దసరా లేదా దీపావళికి విడుదల చేసే అవకాశం ఉంది.

.

తాజా వార్తలు

Allu Arjun To Do Son Of Satyamurthy Sequel- Related....