సుకుమార్‌కు టైమ్ పెట్టిన బన్నీ  

Allu Arjun To Delay Sukumar Film - Telugu Aa20, Ala Vaikuntapuramulo, Allu Arjun Sukumar, Telugu Movie News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు.

Allu Arjun To Delay Sukumar Film

ఇక ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను ఇప్పటికే ముగించుకున్న చిత్ర యూనిట్ రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది.

అయితే ఈ రెండో షెడ్యూల్ షూటింగ్‌కు బన్నీ మరింత సమయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్‌లో జాయిన్ అవ్వాల్సిన బన్నీ, మార్చిలో జాయిన్ అవతానని చెప్పాడట.

తన కుటుంబంతో మరింత సమయాన్ని కేటాయించాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడట.

ఇక పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడట.

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మిక మందన నటించనుంది.

తాజా వార్తలు

Allu Arjun To Delay Sukumar Film-ala Vaikuntapuramulo,allu Arjun Sukumar,telugu Movie News Related....