పుష్పలో బన్నీది ఒక్క లుక్ కాదట!  

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప షూటింగ్ కరోనా లాక్‌డౌన్ తరువాత ఇటీవల తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

TeluguStop.com - Allu Arjun To Be Seen In Multiple Looks

ఇక ఈ సినిమాతో తన సక్సెస్ ట్రాక్‌ను పాన్ ఇండియా లెవెల్‌లో చూపెట్టాలని బన్నీ కసిగా ఉన్నాడు.అటు తమ కాంబోలో ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని సుకుమార్ కూడా కష్టపడుతున్నాడు.

కాగా పూర్తి ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌లో కనిపించనున్నాడు.ఇప్పటికే ఆయన లుక్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.

TeluguStop.com - పుష్పలో బన్నీది ఒక్క లుక్ కాదట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఇటీవల లాక్‌డౌన్ సమయంలో బన్నీ తన లుక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చాడు.దీంతో ఈ సినిమాలో బన్నీ లుక్‌పైనే అందరి దృష్టి ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా తాజాగా బన్నీ పుష్ప చిత్ర షూటింగ్‌ను వైజాగ్‌లో జరుపుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు.అయితే ఈ క్రమంలో బన్నీ తన జుట్టు, గడ్డం లాంటివి కనబడకుండా జాగ్రత్త పడుతూ వాటిని టోపీ, మాస్క్‌లతో కప్పుకున్నాడు.

కాగా పుష్ప చిత్రం కోసం బన్నీ కేవలం ఒక్క లుక్‌లో మాత్రమే కనిపించడని, అందుకే తన కొత్త లుక్‌ను బయట పెట్టకుండా ఉండేందుకే ఇలా జాగ్రత్త పడ్డాడని ఆయన అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా గుసగుసలాడుతున్నాయి.దీంతో పుష్ప చిత్రంలో బన్నీ నిజంగా ఒక్క లుక్‌లో కాకుండా ఇంకా ఎక్కువ లుక్‌లతో కనిపిస్తాడా అనే ప్రశ్న ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇక పుష్ప చిత్రంలో బన్నీ పాత్ర పేరు పుష్పక్‌రాజ్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

#Allu Arjun #Pushpa #Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు