బుట్టబొమ్మా సరికొత్త రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 15వ ర్యాంకు!  

Allu Arjun Thaman Trivikram - Telugu Ala Vaikunthapuramulo, Allu Arjun, Butta Bomma, Thaman, Trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.

 Allu Arjun Thaman Trivikram

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే సక్సెస్ అవుతుందని సినీ విశ్లేషకులు సర్టిఫికెట్ ఇచ్చారు.ఈ సినిమాకు థమన్ అందించిన పాటలే ఇందుకు కారణమని చెప్పాలి.

సామజవరగమనా, బుట్ట బొమ్మా, రాములో రాములా వంటి పాటలు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడమే కాకుండా థమన్ కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బం‌గా ఈ సినిమా నిలిచింది.ఇక అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలు యూట్యూబ్‌లో ఇప్పటికే పలు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి.

బుట్టబొమ్మా సరికొత్త రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 15వ ర్యాంకు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తాజాగా ‘బుట్ట బొమ్మా’ పాట గ్లోబల్ టాప్ 100 సాంగ్స్‌లో 15వ స్థానంలో నిలిచింది.ఇప్పటివరకు ఏ తెలుగు పాట అందుకోని ఫీట్‌ను ఈ పాట అందుకోవడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఇక ఈ పాట కేవలం 3 నెలల్లోనే ఏకంగా 190 మిలియన్ వ్యూస్ దక్కించుకుని ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.కాగా ఈ సినిమాలో బాన్నీ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, త్రివిక్రమ్ టేకింగ్‌కు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో బన్నీ తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కించే పనిలో పడ్డాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Thaman Trivikram Related Telugu News,Photos/Pics,Images..