బన్నీ లిస్టులో మరో డైరెక్టర్.. ఎవరో తెలుసా?  

Allu Arjun Surender Reddy Icon Movie - Telugu Allu Arjun, Icon Movie, Pushpa, Surender Reddy, Tollywood News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Allu Arjun Surender Reddy Icon Movie

ఇక ఈ సినిమాతో బన్నీ మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో బన్నీ పూర్తి మాస్ అవతారంలో నటిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత బన్నీ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది.ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌ను కూడా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ‘ఐకాన్’ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

బన్నీ లిస్టులో మరో డైరెక్టర్.. ఎవరో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా తరువాత బన్నీ మరోసారి తనకు అదిరిపోయే హిట్ అందించిన దర్శకుడితో నటించాలని చూస్తున్నాడు.గతంలో ‘రేసుగుర్రం’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డితో బన్నీ మరోసారి చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నాడట.

మెగాస్టార్ చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి, తన నెక్ట్స్ మూవీని మరోసారి బన్నీతో తెరకెక్కించి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.దీని కోసం బన్నీ దగ్గర గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం దీనికి సంబంధించిన స్ర్కిప్టు పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడట.

మరి సురేందర్ రెడ్డి సినిమాకు బన్నీ ఎలాంటి వేరియేషన్‌తో మనముందుకు వస్తాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Surender Reddy Icon Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test