వైసీపీ తరపున బన్నీ ప్రచారం..?? తిక్కరేగిందిగా..!!!  

Allu Arjun Support To Ycp Candidate-

తిక్కరేగితే నా మాట నేనే వినను ఇది సినిమాలో డైలాగ్ అనుకుంటున్నారా.ఇంచుమించు అలాంటిదే ఇప్పుడు ఈ డైలాగ్ కి స్టైల్ స్టార్ అల్లూ అర్జున్ న్యాయం చేయాలని అనుకుంటున్నాడట..

వైసీపీ తరపున బన్నీ ప్రచారం..?? తిక్కరేగిందిగా..!!!-Allu Arjun Support To YCP Candidate

అందుకు తగ్గట్టుగానే సర్వం సిద్దం చెసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి అర్థం కాలేదా అదేనండి వైసీపీ అభ్యర్ధికి ఆల్ ది బెస్ట్ చెప్పి విజయం నీదే మిత్రమా అని సందేశం పంపిన అల్లూ అర్జున్ ఇష్యూ అందరికి తెలిసిందే. తన మావయ్య పవన్ కళ్యాణ్ నిలబెట్టిన జనసేన అభ్యర్ధిని కాదని వైసీపీ అభ్యర్ధి తరుపున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే కదా.

శిల్పా రవి తనకు మంచి స్నేహితుడని అతడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు గాను అభినందనలు అంటూ ఆయన్ని గెలిపించాలని పోస్ట్ పెట్టాడు.అంటే జనసేన అభ్యర్ధి ఓడిపోవాలనే కదా అందులో అర్థం..

ఇదే పెద్ద దుమారం రేపింది. దాంతో జనసేన తరుపున పోటీ చేస్తున్న ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి అల్లూ అర్జున్ పై ఫైర్ అయ్యారు కూడా. నంద్యాల నియోజకవర్గంలో అర్జున్ ప్రభావం ఏమి ఉండదని, ఆయన ఏమీ ఆ నియోజకవర్గం ఓటర్ కూడా కాదని, ఆ ప్రాంతం వ్యక్తి కూడా కాదు కదా అంటూ ఘాటుగానే స్పందించారు

అయితే ఈ క్రమంలోనే అల్లూ అర్జున్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట. అదేనటంటే.

తన ప్రభావం ఉందని ఇక్కడ తానేమి ఓటరు కాదంటూ వెటకారంగా మాట్లాడిన శ్రీధర్ రెడ్డి కి కౌంటర్ గా బన్నీ శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేయనున్నరాట. తానూ స్నేహితుడికి విషెస్ చెప్పాను కానీ శ్రీధర్ రెడ్డి తనని విమర్శించాడని, అతడు అన్న మాటలకి ఘాటైన సమాధానం చెప్పాలని అభిమానులు గొడవ చేస్తున్నారట. .

ఈ కారణంగానే శిల్పా రవికి మద్దతుగా ప్రచారానికి త్వరలో బన్నీ వెళ్లనున్నాడనే వార్తలు ఇప్పుడు జనసేన వర్గాలలో కాకరేపుతున్నాయి.

సోషల్ మీడియాలో దీనికి సంభందించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒక వేళ బన్నీ నిజంగానే వెళ్తే. శ్రీధర్ రెడ్డి ఓటమి పక్కా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

మరి ఈ వార్తల్లో నిజం ఎంతవరకూ ఉందనేది తెలియదు కానీ బన్నీ వైసీపీకి ప్రచారం వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి.