పుష్ప పార్ట్ 2... స్టోరీ లీక్.. టర్నింగ్ పాయింట్ ఇదేనట?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీన విడుదల అయ్యింది.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది.

 Allu Arjun Sukumar Rashmika Pushpa 2 Story Line Leaked Details, Allu Arjun, Suku-TeluguStop.com

మరోసారి టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ గా కొనసాగుతున్న సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ కు తిరుగులేదు అని పుష్ప సినిమా నిరూపించింది.పుష్ప ది  రైస్ పేరుతో ఈ సినిమా విడుదల అయింది అన్న విషయం తెలిసిందే.

కేవలం హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది.

దాదాపు వంద కోట్ల వరకు బాలీవుడ్ లో పుష్ప సినిమా వసూళ్లు సాధించి అదర గొట్టింది.

అయితే పుష్పా రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నాం అని ముందుగానే దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు.

ఇప్పుడు పుష్ప మొదటి పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక రెండవ పార్ట్ తెరకెక్కించాలా వద్దా అనే దానిపై ఎలాంటి అనుమానాలు లేకుండా పోయాయి.ఫిబ్రవరిలో ఇక పుష్ప రెండో పార్ట్ కు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది.

పుష్ప ది  రూల్ అనే పేరుతో సెకండ్ పార్ట్ రాబోతుంది.అయితే ఇలా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు ఇటీవలి కాలంలో లీకుల బెడద ఇబ్బందికరంగా మారిపోయింది.

కొన్నిసార్లు సినిమాలోని సన్నివేశాలు లీక్ అవుతూ ఉంటే.కొన్నిసార్లు స్టొరీ లైన్ పాయింట్లు లీక్ అవుతూ ఉంటాయి.

Telugu Allu Arjun, Fahadh Faasil, Mother, Pushpa, Pushpa Story, Pushpa Rule, Ras

ఈ క్రమంలోనే భారీ అంచనాల మధ్య తెరకెక్కబోతున్న పుష్ప పార్ట్ 2 సంబంధించి ఇప్పుడు స్టోరీ లైన్ లీక్ అయినట్లు తెలుస్తోంది.రెండు పార్ట్ లో అల్లు అర్జున్ ను సుకుమార్ రూలర్ గా చూపించబోతున్నాడట.ఇప్పటికే మొదటి పార్ట్ లో సిండికేట్ మొత్తాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు పుష్ప.ఈ క్రమంలో రెండో పార్ట్ లో ఎమోషనల్ సెంటిమెంట్ టచ్ చేస్తూ తెరకెక్కించ బోతున్నాడట.

ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ పుష్పలో టర్నింగ్ పాయింట్ గా మారబోతుందని ఒక టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

Telugu Allu Arjun, Fahadh Faasil, Mother, Pushpa, Pushpa Story, Pushpa Rule, Ras

తనని కాదనీ, తన తల్లిని హేళన చేస్తున్న అన్న లను పుష్పా రెండవ పార్ట్ లో దారిలోకి తీసుకొస్తాడట.అంతే కాకుండా ఇక ఏసీపీ గా ఉన్న ఫాహద్ పజిల్ సిండికేట్ కి పెద్దగా కొనసాగుతున్న పుష్ప మధ్య యాక్షన్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయట.ఇదే పుష్ పార్ట్ 2 కనిపించ బోతున్నట్లు ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube