టైటిల్‌ లీక్‌పై సీరియస్‌ అయిన AA20 టీం

అల్లు అర్జున్‌ 20వ చిత్రం పుష్ప ఫస్ట్‌ లుక్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.బన్నీ బర్త్‌డే సందర్బంగా నేడు టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్ ను రివీల్‌ చేయాలని మేకర్స్‌ భావించారు.

 టైటిల్‌ లీక్‌పై సీరియస్‌ అయ�-TeluguStop.com

అయితే టైటిల్‌ పుష్ప అంటూ రెండు రోజుల ముందే రివీల్‌ అయ్యింది.వారం పది రోజుల క్రితమే టైటిల్‌ రెండు అక్షరాలు అని, అది కూడా అమ్మాయి పేరులా ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది.

కనుక టైటిల్‌ను ఎవరో కావాలని యూనిట్‌ సభ్యులు లీక్‌ చేశారు.

Telugu Allu Arjun, Mythri Makers, Pushpa, Sukumar, Tollywood-Movie

ప్రస్తుతం ఈ విషయమై మైత్రి మూవీస్‌ వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.ఖచ్చితంగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు.అల్లు అర్జున్‌ లుక్‌ కూడా గతంలో లీక్‌ అయ్యింది.

ఒక ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌ బయటకు వచ్చింది.లుక్‌ విషయంలో కూడా బయటకు పొక్కడంతో నేడు విడుదలైన పోస్టర్‌ ఇంకా టైటిల్‌పై జనాల్లో పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది.

టైటిల్‌ ముందే లీక్‌ అవ్వడంతో అభిమానులు థ్రిల్‌ ఫీల్‌ అవ్వలేదు.

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఈ విషయమై చాలా ఆసక్తిగా ఎదురు చూసి నేడు ఉదయం 9 గంటల ఫస్ట్‌లుక్‌ టైటిల్‌ రాగానే థ్రిల్‌ అవుతారని అనుకున్నారు.

కాని టైటిల్‌ విషయంలో ముందే లీక్‌ రావడంతో పాటు లారీ డ్రైవర్‌ అంటూ వార్తలు రావడంతో ప్రేక్షకులు ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్‌ పెద్దగా ఆసక్తి లేకుండానే నీరుగారిపోయినట్లుగా బాగుందిలే అంటున్నారట.అందుకే నిర్మాతలు ఈ విషయంలో కాస్త సీరియస్‌గా వ్యవహరించాలని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube