అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.గత ఏడాది ఇండియన్ సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ల్లో పుష్ప అత్యధిక వసూళ్ల ను దక్కించుకొని రికార్డు ను సొంతం చేసుకుంది.
పుష్ప సినిమా రెండు పార్టులుగా రాబోతుందని దర్శకుడు సుకుమార్ గతంలోనే ప్రకటించాడు.ఇప్పుడు రెండో పార్ట్ కోసం పుష్ప అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్ అభిమాను లు పుష్ప పార్ట్ 2 కచ్చితంగా మరో పాన్ ఇండియా సూపర్ హిట్ గా నిలుస్తుంది అనే నమ్మకం తో ఉన్నారు.దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాల్సి ఉంది.
కానీ ఈ సినిమా పై ఉన్న అంచనాల కారణంగా స్క్రిప్ట్ కు ఇంకాస్త మెరుగులు దిద్దే ఉద్దేశం తో టైమ్ తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ రైటర్స్ తో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
సినిమా పుష్ప పార్ట్ 2 ను ఉత్తర భారతంలో భారీ ఎత్తున విడుదల చేయాల్సి ఉంది.కనుక ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి కూడా తగ్గట్లుగా స్క్రిప్టు ను మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా షూటింగ్ ప్రారంభం ఆలస్యానికి స్క్రిప్టు వర్క్ కారణం అంటూ యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఒక్కసారి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తే సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది.ఈ సినిమా షూటింగ్ ని సమ్మర్ లో మొదలు పెట్టి ఇదే ఏడాది డిసెంబర్ లో సినిమా ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.అల్లు అర్జున్ ఈ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నాడు.300 కోట్ల వసూళ్ల ను దక్కించుకున్న సినిమాకు సీక్వెల్ అంటే అంతకు మించి అభిమానులు ఆశిస్తారు.కనుక ఆ స్థాయిలో దర్శకుడు సుకుమార్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడా అనేది చూడాలి.