పుష్ప కోసమే అంటోన్న బన్నీ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.

 Allu Arjun Sukumar Movie Title Pushpa Allu Arjun, Sukumar, Pushpa, Aa20, Rashmik-TeluguStop.com

ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో బన్నీ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికి మొదలు పెట్టాడు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తాడట.

దీనికి సంబంధించిన లుక్‌లో బన్నీ కనిపించడంతో ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుందని, ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడని చిత్ర వర్గాల టాక్.

ఇక ఈ సినిమాకు శేషాచలం అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టినట్లు తెలుస్తోంది.కానీ తాజాగా ఈ సినిమాకు పుష్ప అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.హీరోయిన్ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుండటంతో ఈ టైటిల్‌ను పెట్టినట్లు తెలుస్తోంది.

బన్నీ పుట్టినరోజైన ఏప్రిల్ 8న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనుంది.

ఈ సినిమా టైటల్ విషయంలో మరి ఏది ఫిక్స్ అవుతుందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ అనౌన్స్ చేసేవరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube