సుకుమార్‌ను ఇంకొంత కాలం వెయిట్‌ చేయమన్న బన్నీ  

Allu Arjun Sukumar New Movie Updates-allu Arjun,mahesh Babu,sukumar Movie,trivikram Movie

గత ఏడాది ఆరంభంలో సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రం వచ్చింది.ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.అంతటి విజయం తర్వాత ఆయన దర్శకత్వంలో నటించేందుకు హీరోలు క్యూ కడతారు.కాని సుకుమార్‌ విషయంలో మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది.దాదాపు రెండు సంవత్సరాలు అవ్వబోతున్నా కూడా సుకుమార్‌ కొత్త సినిమాను మొదలు పెట్టలేదు.ఆయన మొదట మహేష్‌బాబుతో సినిమా అనుకుని స్క్రిప్ట్‌ వర్క్‌ చేశాడు.ఆరు నెలల తర్వాత సుకుమార్‌కు మహేష్‌ హ్యాండ్‌ ఇచ్చాడు.

Allu Arjun Sukumar New Movie Updates-allu Arjun,mahesh Babu,sukumar Movie,trivikram Movie-Allu Arjun Sukumar New Movie Updates-Allu Mahesh Babu Sukumar Trivikram

ఆ సమయంలో అల్లు అర్జున్‌ ముందుకు వచ్చాడు.సుకుమార్‌తో సినిమాకు బన్నీ ఆసక్తి చూపించాడు.అయితే వీరిద్దరి కాంబోలో మూవీకి డేట్‌ కుదరడం లేదు.ఇప్పటికే అల వైకుంఠాపురంలో చిత్రంను చేస్తున్న బన్నీ ఆ తర్వాత వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో సినిమాను చేయాలనుకుంటున్నాడు.

Allu Arjun Sukumar New Movie Updates-allu Arjun,mahesh Babu,sukumar Movie,trivikram Movie-Allu Arjun Sukumar New Movie Updates-Allu Mahesh Babu Sukumar Trivikram

ఈ రెండు సినిమాలు పూర్తి చేసి సుకుమార్‌ దర్శకత్వంలో సినిమాను చేయాలని బన్నీ భావిస్తున్నాడు.కాని సుకుమార్‌ మాత్రం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మూవీ అవ్వగానే తనకు డేట్లు ఇవ్వాలని కోరుతున్నాడు.

 ఇటీవల బన్నీ అందుకు ఓకే అన్నట్లుగా అనిపించినా మళ్లీ ఏం జరిగిందో కాస్త వెయిట్‌ చేయాల్సిందిగా కోరాడట.మొదట అనుకున్నట్లయిగా అయితే ఈనెలలోనే సినిమాను పట్టాలెక్కించాల్సి ఉంది.కాని సినిమా ప్రస్తుతానికి లేదని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.సుకుమార్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసుకుని వెయిటింగ్‌ చేస్తున్న నేపథ్యంలో ఎందుకు బన్నీ వెయిట్‌ చేయాల్సిందిగా కోరాడు అనేది అర్థం అవ్వడం లేదు.ఈ సినిమా మెల్లగా వచ్చే ఏడాది వరకు నెట్టుకు పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.