మహేష్, ఎన్టీఆర్ కలిస్తే బన్నీ అంటోన్న సుకుమార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తన కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇప్పటకే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ వాయిదా వేసుకుంది.

 Allu Arjun Sukumar Movie Genre Revenge Drama-TeluguStop.com

కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులపై బన్నీ కన్నేశాడు.

అయితే ఈ సినిమాలో బన్నీ చాలా మాస్ లుక్‌లో మనకు కనిపిస్తాడట.

ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుందని, ఇందులో బన్నీ ఓ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ సినిమాను కూడా డైరెక్టర్ సుకుమార్ తన గత చిత్రాల మాదిరిగా తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు నటించిన 1-నేనొక్కడినే, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో వంటి సినిమాలు రివెంజ్ డ్రామా సబ్జెక్టులుగా వచ్చి ఎలాంటి హిట్ అందుకున్నాయో తెలుసు.ఇప్పుడు బన్నీతో చేయనున్న సినిమాను కూడా ఇదే కోవలో తెరకెక్కిస్తున్నాడట సుక్కు.

మొత్తానికి మరోసారి రివెంజ్ డ్రామాకు ఎమోషన్స్‌ను యాడ్ చేసి సుకుమార్ తన స్ట్రాటజీతో బ్లాక్‌బస్టర్ అందుకునేందుకు ఆసక్తి చూపుతున్నాడు.మరి ఈసారి సుక్కు స్ట్రాటజీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube