ఆ యంగ్‌ హీరోకు బన్నీ ఇచ్చిన సలహ ఏంటో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో గైడెన్స్‌ లేకపోవడం వల్ల చాలా మంది తప్పుడు నిర్ణయాలతో కెరీర్‌ను నాశనం చేసుకుంటారు.కొందరు తప్పుడు నిర్ణయాల వల్ల అసలు ఇండస్ట్రీలో గుర్తింపే రాకుండా వెళ్లి పోతే మరికొందరు మంచి హిట్స్‌ పడ్డ తర్వాత తప్పుడు నిర్ణయాలతో మొత్తం కెరీర్‌ను రిస్క్‌లో పెట్టుకుంటారు.

 Allu Arjun Suggestions To Sri Vishnu Abouthiscareer-TeluguStop.com

తమ ఇమేజ్‌ మరియు తమ స్థాయిని చూసి సినిమాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.అలా కాకుండా కొందరు గైడెన్స్‌ లేక పోవడంతో ఇష్టానుసారంగా వచ్చిన అవకాశాలన్నింటికి కూడా కుమ్మేస్తూ ఉంటారు.
ఎక్కువ సినిమాలు చేయాలనే ఆతృతతో మొదటికే మోసం వస్తుంది.మొత్తానికి సినీ ఇండస్ట్రీలో గాడ్‌ ఫాదర్‌ లేదా ఒక సలహా దారు ఉండాలి అంటారు.అలా ఒక యంగ్‌ హీరోకు అల్లు అర్జున్‌ సలహాదారుగా ఉన్నాడట.యంగ్‌ హీరో శ్రీవిష్ణు కెరీర్‌ ఆరంభంలో ప్రేమ ఇష్క్‌ కాదల్‌ చిత్రాన్ని చేశాడు.

ఆ చిత్రం చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంది.ఆ సినిమా చూసిన బన్నీ శ్రీవిస్ణును పిలిచి మాట్లాడాడట.

Telugu Allu Arjun, Alluarjun, Sri Vishnu, Tippara Meesam-

  సినిమా సక్సెస్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మంచి సినిమాలు ఎంపిక చేసుకోవాలని సూచించాడట.ప్రస్తుతానికి కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉండమని, నీకు మంచి ఫ్యూచర్‌ ఉంటుందని చెప్పాడట.ప్రయోగాత్మక చిత్రాలను ఎక్కువగా చేయడం వల్లే నీవు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటావంటూ సూచించాడట.అందుకే శ్రీవిష్ణు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నాడు.ఇప్పుడు కూడా తిప్పుర మీసం అంటూ విభిన్నమైన చిత్రాన్ని చేశాడు.త్వరలో ఆ సినిమా విడుదల కాబోతుంది.

బన్నీ సలహాతో తన కెరీర్‌ ఇంకా కొనసాగుతుందని ఈ కుర్ర హీరో చెబుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube