వైరల్ అవుతున్న అల్లు అర్జున్ స్టైలిష్ లుక్.. మాములుగా లేదుగా !

టాలీవుడ్ హీరోల్లో స్టైలిస్ట్ స్టార్ పేరు సంపాదించు కున్నాడు అల్లు అర్జున్.ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ తన స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉన్నటు బన్నీ.

 Stylish Star Allu Arjun Stylish Look Goes Viral In Social Media, Allu Arjun, Suk-TeluguStop.com

ఆయన లుక్ ప్రతి సినిమాకు చాలా డిఫెరెంట్ గా స్టైలిష్ గా ఉంటుంది.తాజాగా అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసాడు.

ఇప్పుడు ఆ ఫోటో నెట్టింట విపరీతంగా షేర్ అవుతుంది.

ఆ లుక్ గురించి ఇప్పుడు ఫ్యాన్స్ మాట్లాడు కుంటున్నారు.ఆ లుక్ కు ఎందుకంత ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే ఆ లుక్ పుష్ప సినిమాలోనిది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇదే లుక్ లో కనిపించ బోతున్నాడని టాక్ వినిపిస్తుంది.

పొడవాటి జుట్టుతో, గడ్డంతో నల్ల కళ్లద్దాలు పెట్టుకున్న పిక్ అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చెయ్యగానే అది కాస్త వైరల్ అయ్యింది.

ఈ సాలిడ్ లుక్ అభిమానులను ఫిదా చేస్తుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈయనకు జోడీగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పుష్ప ఆల్బమ్ పై మంచి హైప్ ఏర్పడింది.ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.అందువల్ల విడుదల కూడా ఆలస్యం అవుతుంది.

ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.మొదటి భాగం షూటింగ్ చివరి దశలో ఉంది.

ఈ సంవత్సరమే మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube