స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో బన్నీ తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ప్రారంభించిన బన్నీ, ఈ సినిమాలో తన పాత్ర కోసం కష్టపడుతున్నాడు.ఈ సినిమాలో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడతాడని, రఫ్ లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తాడట.దీని కోసం చిత్తూరు యాసను నేర్చుకుంటున్నాడట బన్నీ.
రష్మిక మందన హీరోయిన్గా నటించనున్న ఈ సినిమా మెజారిటీ పార్ట్ షూటింగ్‌ను శేషాచలం అడవుల్లో తెరకెక్కించనున్నారు.ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
మరి చిత్తూరు యాసలో బన్నీ ఎలా రెచ్చిపోతాడో చూడాలి.