సింపుల్ గా అల్లు అర్జున్ కొడుకు పుట్టిన రోజు వేడుకలు....

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ గురించి తెలియని వారుండరు.అయితే చిన్న వయసులోనే అల్లు అయాన్ తనకంటూ టాలీవుడ్ లో కొంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

 Allu Ayaan 6th Birthday, Allu Ayaan News, Allu Arjun. Snehalatha Reddy, Allu Arh-TeluguStop.com

అంతేగాక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా అల్లు అయాన్ తెగ హల చల్  చేస్తున్నాడు.

అయితే ఈరోజు అల్లు అయాన్ 6వ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను అల్లు అర్జున్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.

దీంతో అల్లు అర్జున్ అభిమానులు అల్లు అయాన్ కి భారీ ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా పుట్టిన రోజు వేడుకలను చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ పుట్టినరోజు వేడుకల్లో కేవలం అల్లు అర్జున్ మరియు తన భార్య స్నేహలతా రెడ్డి, అల్లు అర్హ, బర్త్ డే బాయ్ అల్లు అయాన్ మాత్రమే పాల్గొన్నట్లు కనిపిస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ మాస్ యాంగిల్ కలిగినటువంటి లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు ప్రస్తుతం కేరళలో జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube