అల్లు అర్జున్ కి స్ట్రోక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ మధ్య సెలబ్రిటీలు అని కూడా కనికరించడం లేదు.ట్రాఫిక్ రూల్స్ ఏ మాత్రం అతిక్రమించిన నిర్మొహమాటంగా జరిమానాలు విధిస్తున్నారు.

 Allu Arjun Slapped Withfine By Cyberabadpolice For Violatingrules-TeluguStop.com

కొద్ది రోజుల ఇస్మార్ట్ శంకర్ సినిమా చూడటానికి ఆర్జీవి ట్రిపుల్ రైడింగ్ మీద వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు.పోలీసులు అతను జర్నీ చేసిన బైక్ కి ట్రిపుల్ రైడింగ్ తో పాటు, హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు ఫైన్ వేసారు.

తాజాగా అల్లు అర్జున్ కి కూడా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసారు.అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం సొంతంగా ఒక క్యారవ్యాన్ కొనుక్కున్నాడు.

ఖరీదైన ఈ క్యారవ్యాన్ గురించి మీడియాలో కూడా ప్రముఖంగా వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు ఈ క్యారవ్యాన్ కి పోలీసులు జరిమానా వేసారు.హిమాయత్ నగర్ దగ్గర ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో అటుగా వెళ్తున్న మహ్మద్‌ అబ్దుల్‌ ఆజం క్యారవ్యాన్ ని గమనించాడు.క్యారవాన్‌ అద్దాలు పూర్తిగా బ్లాక్‌ఫిల్మ్‌తో కప్పబడి ఉన్నాయి.

రాష్ట్రంలో బ్లాక్‌ఫిల్మ్‌ అద్దాలపై నిషేధం ఉండటంతో అబ్ధుల్‌ ఆజం క్యారవాన్‌ వాహనాన్ని ఫొటోతీసి ట్విటర్‌లో సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సిటిజన్స్‌ నుంచి వచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న శంషాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు, క్యార వ్యాన్ వాహనాన్ని పరిశీలించి అల్లు అర్జున్‌కు చెందినదిగా గుర్తించారు.

నిబంధనలు ఉల్లంఘించి క్యారవాన్‌ వాహనం అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌ ఉపయోగించినందుకుగాను యజమాని అల్లు అర్జున్‌కు 735 రూపాయిల జరిమానా విధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube