అల్లూ అర్జున్ - థియేటర్ లు దద్దరిల్లేలా చేస్తున్నాడు     2016-02-20   00:33:26  IST  Raghu V

అల్లూ అర్జున్ తెరమీదకి రాగానే థియేటర్ లు దద్దరిల్లుతున్నాయి. అతన్ని చూసి అతను డైలాగ్ చెప్పగానే జనాలు విజిల్స్ తో మోత మోగిస్తున్నారు. అల్లూ అర్జున్ సినిమాలు ఏవీ థియేటర్ లో ఆడడం లేదు కదా ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా ? నిజమే ఆడట్లేదు కానీ సరైనోడు టీజర్ ఒచ్చేసింది గా . ఈ సినీమా టీజర్ నుంచే ప్రమోషన్ మొదలు పెట్టారు ఈ సినిమా నిర్మాత అల్లూ అరవింద్. సో ఆ లెక్కలే ఇప్పటికే ఆంధ్రా – తెలంగాణా లలో అన్ని థియేటర్ లలో దాదాపుగా ఈ సినేమా టీజర్ ప్లే చేస్తున్నారు. సర్ ర్ ర్ అంటూ మొదలయ్యే ఈ టీజర్.. సౌండ్ తో మొదట చంపేస్తే.. తరువాత.. ‘ఎర్ర తోలు.. మాస్.. ఊరర.. మాస్ స్..’ అంటూ అల్లు అర్జున్ డైలాగ్ తో అదిరిపోతోంది. ధియేటర్ లో టీజర్ చూసిన వారందరికీ ఒకటే ఫీలింగ్.. ఈసారి బన్నీ ఓ పెద్ద హిట్ కొడుతున్నాడు. ఈ రేంజులో మాస్ మసాలా ఉంటే.. ఇక ధియేటర్స్ లో రచ్చ రంబోలా అంటున్నారు.