ఫస్ట్ పుష్పని వైజాగ్ లో స్టార్ట్ చేయబోతున్న అల్లు అర్జున్  

Allu Arjun set to kick-start Pushpa in Vizag, Tollywood, Telugu Cinema, South Cinema, Sukumar, Visakhapatnam - Telugu Allu Arjun, Pushpa, South Cinema, Sukumar, Telugu Cinema, Tollywood, Visakhapatnam, Vizag

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.ఈ సినిమా ఎనౌన్సమెంట్ ఎప్పుడో జరిగింది.

TeluguStop.com - Allu Arjun Set To Kick Start Pushpa In Vizag

అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది.చిత్తూరు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా పక్కా మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతుంది.

బన్నీ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ని రంపచోడవరం ఫారెస్ట్ లో మొదలు పెట్టాలని దర్శకుడు సుకుమార్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నాడు.ఫారెస్ట్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్న ఇప్పుడు మనసు మార్చుకొని ముందుగా ఒక సాంగ్ ఫినిష్ చేస్తే టీమ్ మొత్తానికి జోష్ వస్తుందని ఆ దిశగా ఆలోచించి వైజాగ్ లో ఫస్ట్ షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

TeluguStop.com - ఫస్ట్ పుష్పని వైజాగ్ లో స్టార్ట్ చేయబోతున్న అల్లు అర్జున్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో వైజాగ్ లో అల్లు అర్జున్, రష్మిక మీద ఒక సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకొని వెంటనే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫారెస్ట్ లోకి వాలిపోనున్నారు. శేషాచలం ఫారెస్ట్ లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా సుకుమార్ ఈ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

ఇందులో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ కనిపిస్తాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ కి చెందిన యంగ్ హీరో నటిస్తాడని తెలుస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.రంగస్థలం తర్వాత అదే ఫ్లేవర్ తో సుకుమార్ మరోసారి పుష్ప సినిమా చేస్తున్నాడు.

మరి ఇది ఎంత వరకు బన్నీకి పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ ఇస్తుంది అనేది చూడాలి.

#Pushpa #Sukumar #Visakhapatnam #Vizag #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Set To Kick Start Pushpa In Vizag Related Telugu News,Photos/Pics,Images..