ప్రేక్షకుల ముందుకి సామజవరగమన వీడియో సాంగ్  

Samajavaragamana Video Release In - Telugu Ala Vaikuntapuramlo, Release In , Samajavaragamana Video , Tollywood

అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లను రాబడుతోంది.ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు పాటలు ఎంత హైప్ తీసుకోచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Samajavaragamana Video Release In - Telugu Ala Vaikuntapuramlo, Release In , Samajavaragamana Video , Tollywood-Movie-Telugu Tollywood Photo Image

అందులో సామజవరగమన పాట టాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత మంచి సాహిత్యంతో వచ్చి సెన్సేషన్ హిట్ అయ్యింది.ఒక విధంగా చెప్పాలంటే ఈ పాత యుట్యూబ్ ని షేక్ చేసింది.

స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను ఇప్పటికి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటారు.ఇక హీరోయిన్ కాళ్ళ అందాన్ని వర్ణిస్తూ హీరో ప్రేమలో పడి పాడుకునే పాటగా దర్శకుడు త్రివిక్రమ్ దీనిని చిత్రీకరించారు.

అయితే ఇంత మంచి సాంగ్ ని సినిమాలో సందర్భం లేకుండా పెట్టడం కాస్తా ఆడియన్స్ అసంతృప్తి ఫీల్ అయిన కూడా వీడియో మాత్రం చాలా అద్బుతంగా ఉండటంతో పాట నచ్చడంతో దైలో లీనమైపోయారు.ఇదిలా ఉంటే సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా యుట్యూబ్ లో విడుదల చేసింది.

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఈ పాటను చూస్తే అచ్చం వెండితెరపై చూసినట్టే ఉంటుంది.సిరివెన్నెల సాహిత్యానికి ప్రాణం పోసిన తమన్ దానికి ఊపిరి అందించిన సిద్ శ్రీరామ్ ని ఈ పాట ఈ ఏడాది టాప్ చైర్ లో కూర్చోబెట్టింది అని చెప్పాలి.

ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రస్తుతం ట్రెండ్ సృష్టిస్తుంది.

తాజా వార్తలు

Samajavaragamana Video Release In -release In ,samajavaragamana Video ,tollywood Related....