డాన్స్ లో నేనేమీ ప్రత్యేకం కాదు అంటున్న అల్లు అర్జున్  

Allu Arjun Said I Am not Special in Dance, Tollywood Heroes, Jr NTR, Telugu Cinema, Allu Arjun, Ram Charan - Telugu Allu Arjun, Allu Arjun Said I Am Not Special In Dance, Jr Ntr, Ram Charan, Telugu Cinema, Tollywood Heroes

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి డాన్స్ కింగ్ గా తనదైన ముద్ర వేసుకున్నారు.తెలుగులో సినిమాలలో డాన్స్ అంటే ఇలా ఉండాలి అని చూపించిన ఘనత అతనిదే.

TeluguStop.com - Allu Arjun Said I Am Not Special In Dance

అతని డాన్స్ లో గ్రేస్ ఉంటుంది.ఆ టాలెంట్ చిరంజీవిని మెగాస్టార్ గా నిలబెట్టింది.

చిరంజీవి రేంజ్ లో డాన్స్ చేయగలిగే హీరోలు అప్పట్లో ఎవరూ లేరనే చెప్పాలి.బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున డాన్స్ లు చేసిన చిరంజీవి గ్రేస్ ని చూపించలేకపోయేవారు.

TeluguStop.com - డాన్స్ లో నేనేమీ ప్రత్యేకం కాదు అంటున్న అల్లు అర్జున్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ప్రెజెంట్ ట్రెండ్ లో డాన్స్ అంటే అందరికి గుర్తుకొచ్చే నటులు జూనియర్ ఎన్ఠీఆర్, అల్లు అర్జున్.వీరి డాన్స్ లకి అభిమానులు ఉన్నారు.

అల్లు అర్జున్ డాన్స్ లో స్పీడ్, స్టైల్ ఉంటే, తారక్ డాన్స్ లో రిథమ్ ఉంటుంది.అందుకే ప్రస్తుతం ఉన్న హీరోలలో బెస్ట్ డాన్సర్స్ అంటే వీరిద్దరి పేర్లే వినిపిస్తాయి.

అయితే ఒక్కోసారి ఎవరి సామర్ధ్యం వాళ్ళకి నచ్చదు అనడానికి అల్లు అర్జున్ మాటలే ఉదాహరణ.తాను చేసిన డాన్స్ లలోచాలా తప్పులు ఉంటాయనిఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తన డాన్స్ లు చూసేవారికి చాలా గొప్పగా అనిపించినా అందులో చాలా పొరపాట్లు ఉంటాయని, సిచువేషన్ కి తగ్గట్లు డాన్స్ ఉండదని చెప్పుకొచ్చాడు.అయితే తన డాన్స్ లో తప్పులు ఎవ్వరూకూడా గ్రహించరని బన్నీ చెప్పడం విశేషం.

అలాగే ఒకప్పుడు డాన్స్ అంటే చాలా తక్కువ మంది ఉండే వారని, ఇప్పుడు ఆ పరిస్థితిలేదని బన్నీ చెప్పుకొచ్చాడు.ఇప్పుడు కొత్తగా వస్తున్న హీరోలు అందరూ డాన్స్ లు అద్భుతంగా చేస్తున్నారు.

ట్రెండ్ కి తగ్గట్లు కొత్తగా వచ్చే హీరోలు డాన్స్ లో కూడా సత్తా చాటడానికి ముందుగానే సిద్ధమవుతున్నారు.నేనొక్కడినే డాన్స్ చేస్తాను అని చెప్పుకొనే పరిస్థితి లేదు.

కాకపోతే తాను డాన్సులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటా కాబట్టి తన డాన్సుల్లో ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంటుందని అల్లు అర్జున్ తెలిపాడు.

.

#Ram Charan #Jr NTR #AlluArjun #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Said I Am Not Special In Dance Related Telugu News,Photos/Pics,Images..